Take a fresh look at your lifestyle.

లైంగిక వేధింపులకు పాల్పడిన టీఆర్‌ఎస్‌ ‌నేతలను అరెస్టు చేయాలి

Prof Kodandaram, President of TJS party
టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌

సిరిస్లి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ టీఆర్‌ఎస్‌ ‌నేతలను వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రో.కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ ఘటన వెనక ఎంత పెద్ద నాయకులున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్‌ను ప్రొ.కోదండరామ్‌ ‌నేతృత్వంలోని టీజేఎస్‌ ‌నేతల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ‌నాయకులు దేవయ్య, హాస్టల్‌ ‌వర్కర్‌ ‌విజయలక్ష్మిని అరెస్టు చేసి చేతులు దులుపుకుంటే సహించేది లేదన్నారు.

ఈ ఘటన వెనక టీఆర్‌ఎస్‌ ‌బడా నేతల హస్తం ఉందనీ, వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకూ బాధిత విద్యార్థినులకు అండగా నిలుస్తామని స్పస్టం చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్‌ ‌జడ్జితో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అసలైన సూత్రదారులను అరెస్టు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

Leave A Reply

Your email address will not be published.