Take a fresh look at your lifestyle.

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు నిరసనగా… నేడు రాష్ట్ర బంద్‌

ఇప్పటికే మద్దతు ప్రకటించిన టీఆర్‌ఎస్‌, ‌విపక్ష పార్టీలు

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలకు నిరసనగా రైతు సంఘాల ఆధ్వర్యంలో నేడు భారత్‌ ‌బంద్‌ ‌జరుగనుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ భారత్‌ ‌బంద్‌కు రాజకీయ పార్టీలకు అతీతంగా అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీతో పాటు కాంగ్రెస్‌, ‌సిపిఐ, సిపిఎం, టీజేఎస్‌ ‌పార్టీలు భారత్‌ ‌బంద్‌కు తమ మద్దతు ప్రకటించాయి. అలాగే, రాష్ట్రంలోని. పది ప్రధాన కార్మిక సంఘాలతో పాటు బ్యాంకు యూనియన్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు కూడా బంద్‌లో పాల్గొననున్నట్లు ప్రకటించాయి. రైతుల నడ్డి విరిచే విధంగా ఆమోదించిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ‌బంద్‌లో పాల్గొంటుందని సీఎం కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించి రైతులకు కనీస మద్దతు ధర •సైతం లేకుండా చేయడం దారుణమనీ, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

బంద్‌కు మద్దతుగా తనతో పాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్నాకు దిగుతున్నట్లు కేటీఆర్‌ ‌ప్రకటించారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి రావొద్దనీ, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వ్యాపార, వాణిజ్య సంఘాలు రెండు గంటల పాటు ఆలస్యంగా తమ కార్యకలాపాలు ప్రారంభించి స్వచ్చందంగా బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బంద్‌కు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన రహదారులపై ధర్నాలకు దిగాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య, సంస్థల ప్రతినిధులను కలసి బంద్‌కు సహకరించాలని కోరాలని సూచించారు. అలాగే, టీఎన్జీవో నేతలు కూడా నేటి భారత్‌ ‌బంద్‌లో పాల్గొననున్నట్లు ప్రకటించారు. తమ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

కాగా, నేటి భారత్‌ ‌బంద్‌కు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం దేశానికి అన్నం పెట్టేరైతులను కార్పొరేట్‌ ‌రంగాలకు బానిసలుగా మాచ్చాలని చూస్తున్నదని విమర్శించారు. రైతులకు సంఘీభావంగా బంద్‌లో పాల్గొననున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎం‌ప్లాయిస్‌ ‌యూనియన్‌ ‌ప్రకటించింది. ఈమేరకు సర్కిల్‌ ‌కార్యదర్శి సంపత్‌రావు తమ యూనియన్‌ ఉద్యోగులంతా నేటి భారత్‌ ‌బంద్‌కు సంపూర్ణ మద్దతుగా భోజన విరామ సమయంలో నిరనన తెలియజేస్తామని తెలిపారు. తమ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరె•• కావాలని సూచించారు. కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగుల సంఘాలతో పాటు ఎన్డీయేతర ప్రభుత్వాల మద్ధతు కూడగట్టుకుంటూ ఇంకా ఉధీతమౌతున్నది. రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు కూడా బంద్‌కు మద్దతు ప్రకటించిన నేపథ్యలో నేడు సాధారణ జన జీవనానికి తీవ్ర విఘాతం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, ‌రవాణా సేవలు స్తంభించి పోయే అవకాశం ఉంది.

Leave a Reply