Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి

అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణం

టిఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత, నాగార్జునసాగర్‌ ‌శాసనసభ్యులు నోముల నర్సింహయ్య ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను అపోలో హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

30 సంవత్సరాల నోముల రాజకీయ, ప్రజా జీవితంలో మొదటసారిగా 1987లో జరిగిన మండల పరిషత్‌ ఎన్నికల్లో నకిరేకల్‌ ‌నియోజకవర్గ కేంద్ర మండలం అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అనంతరం 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మార్క్సిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ పక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై గొంతు ఎత్తారు. తిరిగి మూడో పర్యాయం 2018 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాగార్జునసాగర్‌ ‌నియోజకవర్గ నుంచి విజయం సాధించి ప్రస్తుతం శాసనసభ్యుడుగా కొనసాగుతున్నారు. సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించి ఆయన న్యాయశాస్త్ర పట్టభద్రుడు.

Leave a Reply