- జ్ఞానభూమి వద్ద పలువురు ప్రముఖుల శ్రద్దాంజలి
- ఆయన సంస్కరణలు దేశానికి దిక్సూచి అని ప్రశంసలు
- భారతరత్న కోసం అసెంబ్లీ తీర్మానం చేసి పంపుతామన్న కెకె
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో ఘనంగా నివాళి అర్పించారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు ఇక్కడికి వచ్చి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. అధికార టిఆర్ఎస్ నేతలతో పాటు, కాంగ్రెస్, బిజెపి తదితర పార్టీల నేతలు పివి పాలన సంస్కరణలను కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. పీవీ ఘాట్ వద్ద అంజలి ఘటించారు.
పీవీ కుమార్తె వాణి, కుమారుడు పీవీప్రభాకర్ రావు హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ, పీవీ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కేశవరావు (కేకే), ఎమ్మెల్సీ కవిత తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా పీవీ ఆలోచనలు సూచనలు మన వెంట ఉన్నాయని అన్నారు. ఎంపీ కేకే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.