Take a fresh look at your lifestyle.

అధికారం ముసుగులో టీఆర్‌ఎస్‌ ‌నేతల ఆగడాలు

  • రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారు
  • గవర్నర్‌ ‌తమిళిసైకి బీజేపీ నేతల ఫిర్యాదు

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : అధికారం ముసుగులో టీఆర్‌ఎస్‌ ‌నేతల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని బీజేపీ నేతలు గవర్నర్‌ ‌తమిళిసైకి ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఇటీవల రామాయంపేట, ఖమ్మంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో బుధవారం బీజేపీ ప్రతినిధుల బృందం గవర్నర్‌ ‌తమిళిసైకి రాజ్‌భవన్‌లో వినతిపత్రం అందజేసింది.. బీజేపీ నేతలు రఘునందన్‌రావు, ఎన్‌.‌రాంచందర్‌రావు, పొంగులేటి సుధాకరరెడ్డి, ప్రేమేందర్‌ ‌రెడ్డితో కూడిన ప్రతినిది బృందం ఖమ్మం, రామాయంపేట ఆత్మహత్యల ఘటలనపై సిబిఐతో విచారణ జరిపించాలని కోరింది.

అనంతరం రఘునందన్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ హత్యలు, పోలీసుల ప్రవర్తనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామనీ, ప్రతిపక్ష నాయకులను కౌన్సిలింగ్‌ ‌పేరుతో హింసిస్తున్నారనీ, రాష్ట్ర పోలీసులు విచారణ జరిపితే నిస్పష్గపాతంగా జరగతని పేర్కొన్నారు. ఖ్‌మ్మంలో సాయిగణేశ్‌, ‌కామారెడ్డిలో సంతోష్‌, ‌పద్మల ఆత్మహత్యల ఘటలనపై సిబిఐతో విచారణ జరిపించినప్పుడే బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరుగుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ‌నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారనీ, పోలీసులు అడ్డుకోకుండా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు.

ఖమ్మం ఘటనలో మంత్రి పువ్వాడపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలనీ, లేదంటే ప్రభుత్వం బర్థరఫ్‌ ‌చేయాలని రాంచందర్‌రావు డిమాండ్‌ ‌చేశారు. కేసీఆర్‌ ‌రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనీ, గవర్నర్‌గా తన అధికారాన్ని ఉపయోగించి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవాలని ఈ సందర్భంగా బీజేపీ ప్రతినిధుల బృందం గవర్నర్‌ ‌తమిళిసైని కోరింది.

Leave a Reply