తాండూరు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు టిఆర్ఎస్ నాయకురాలు గాజుల మాధవి అండగా నిలిచారు. తాండూరు పట్టణంలోని వాల్మీకి నగర్ కు చెందిన విద్యార్థులు విజయ విద్యాలయ పాఠశాలలో చదువుతున్న ఆర్తి యూకేజీ అరవింద్ ఎల్కేజీ అనే విద్యార్థులకు ఒక సంవత్సరానికి అయ్యే ఫీజులు చెల్లించి అండగా నిలిచారు. తండ్రిని కోల్పోయి ఆపదలో ఉన్న విద్యార్థులను ఆదుకోవాలనే మానవతా దృక్పథంతో తనవంతుగా వారికి సంవత్సరం ఫీజు చెల్లించడం జరిగిందని అన్నారు.
Tags: thandur trs leader, gajula Madhavi, helped, poor students, valmiki nagar