Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో అరాచక పాలన

  • కేసీఆర్‌ ‌కుటుంబం దోచుకుంటుంది: ఉత్తమ్‌ ‌ఫైర్‌
  • ‌కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డీ…చెంచాగిరి మానుకో..: నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి
  • కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డే: కోమటిరెడ్డి
  • కాంగ్రెస్‌లో చేరిన టిఆర్‌ఎస్‌ ‌నేత చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
  • అభివృద్ధిపై రచ్చబండ పెడదామా? టిఆర్‌ఎస్‌కు శ్రీనివాస్‌రెడ్డి సవాల్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబంపై తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనదైనశైలిలో మండిపడ్డారు. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణను ఇస్తే…రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత కేసీఆర్‌ అరాచక పాలనను సాగించడమే కాకుండా, రాష్ట్రంలోని సంపద, వనరులను కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులు దోచుకుతింటున్నారనీ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంకు చెందిన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకుడు, మాజీమంత్రి, దివంగత చెరుకు ముత్యంరెడ్డి తనయుడైన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన శ్రీనివాస్‌రెడ్డి ఆయన అనుచరులకు పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌మాట్లాడుతూ.. ఎన్నికలను టిఆర్‌ఎస్‌ ‌పార్టీ పూర్తిగా కమర్షియల్‌గా చేసిందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల వేళ…టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఇచ్చే మద్యం,డబ్బులు తీసుకోని వోట్లు మాత్రం కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థికి వేయాలన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ పంచే మద్యం, డబ్బులన్నీ మనవేననీ, మన డబ్బులు మనకు ఇస్తున్నారనీ, డబ్బుల, మద్యం తీసుకుని వోటు మాత్రం కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థికి వేయాలన్నారు.

గజ్వేల్‌, ‌సిద్ధిపేటను ఆనుకుని ఉన్న దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. సిద్ధిపేట, గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు జరగలేదన్నారు. దుబ్బాకలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదనీ, ఇదే అంశాన్ని కాంగ్రెస్‌ ‌శ్రేణులందరూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి హరీష్‌రావు…దుబ్బాక టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనేనంటూ చేస్తున్న ప్రచారం చూస్తుంటే ఎమ్మెల్యేలకు వ్యక్తితత్వం లేదా? అని ప్రశ్నించారు. అన్ని పదవులకు కేసీఆర్‌ ‌కుటుంబానికే కావాలా?అని అడిగారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్‌ ‌పార్టీలోని ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో దామోదర్‌ ‌వంటి సమర్ధవంతమైన నాయకులున్నారనీ, ఈ నెల 7 నుంచి నవంబర్‌ 1‌వరకు తనతో పాటు కాంగ్రెస్‌ ‌రాష్ట్ర నాయకులందరూ దుబ్బాకలోనే ఉంటామన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఆపదవచ్చినా, సహకారం చేసేందుకైనా తనతో పాటు మిగతా కాంగ్రెస్‌ ‌నేతలందరూ అందుబాటులో ఉంటారన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌శ్రేణులందరమూ సర్వశక్తులొడ్డైనా కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకుందామన్నారు.

సోనియాగాంధీ అనుమతితో బుధవారం దుబ్బాక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్‌ ఎం‌పి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ…దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. అందరమూ కలిసి దుబ్బాకలో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతల అహంకారానికి బ్రేకులు వేద్దామన్నారు. దుబ్బాక అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డే ఉంటారనీ, దీంట్లో మరో అనుమానానికి తావు లేదన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ…రామలింగారెడ్డి మరణాన్ని ఎవరూ కోరుకోలేదనీ, ఈ ఉప ఎన్నికల్లో ప్రజల్లో సానుభూతి కోసమే టిఆర్‌ఎస్‌ ‌పార్టీ రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతకు టికెట్‌ ఇచ్చారనీ, సింపతి రామలింగారెడ్డి కుటుంబానికే కాదూ, చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి కూడా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ ‌నాయకులందరూ కలిసి కట్టుగా పని చేసి ఈ ఉప ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకుందామన్నారు. అధికారులు టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెంచాలుగా పని చేయొద్దన్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి కలెక్టర్‌గా కాకుండా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ చెంచాగా, చప్రాసిగా పని చేస్తున్నారనీ ఆరోపించారు. కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి అక్రమంగా వేల ఎకరాలు సంపాదించారనీ, ఆయన దందాలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే వెంకట్రామరెడ్డి పదవీ విరమణ చేసినా కూడా ఆయన అవినీతి, అక్రమాలను తవ్వుతామనీ హెచ్చరించారు.

ఎట్టి పరిస్థితులలో వెంకట్రామరెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. టిఆర్‌ఎస్‌కు చెంచాగిరి చేస్తున్న కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డిని వెంటనే బదిలీ చేయాలని ఎన్నికల సంఘం అధికారులను డిమాండు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోలీస్‌ అధికారులు, సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలనీ, అలా కాకుండా అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి తొత్తులుగా పని చేస్తామంటే కాంగ్రెస్‌ ‌పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. కాంగ్రెస్‌ ‌కార్యకర్తలెవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదనీ, మీ వెంట కాంగ్రెస్‌ ‌పార్టీ ఉంటుందనీ, ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి గెలిచి తీరాలని జగ్గారెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ…ముత్యంరెడ్డి హయాంలో దుబ్బాక అభివృద్ధి జరిగిందా? రామలింగారెడ్డి హయాంలో అభివృద్ధి జరిగిందా? ఏ గ్రామంలోనైనా రచ్చబండ పెట్టడానికి సిద్ధమా?అని సవాల్‌ ‌విసిరారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతల అవమానంతోనే మా తండ్రి ముత్యంరెడ్డి గుండె పగిలి చనిపోయారనీ శ్రీనివాస్‌రెడ్డి చెప్పుకొచ్చారు. రాబోవు దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త ఓ అభ్యర్థిగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ‌నేతలు దామోదర రాజనర్సింహా, పొన్నాల )క్ష్మయ్య, షబ్బీర్‌ అలీ, జెట్టి కుసుమకుమార్‌, ‌సీతక్క, తూంకుంట నర్సారెడ్డి, రాములునాయక్‌, ‌గాలి అనిల్‌కుమార్‌, ఇం‌దిరా శోభన్‌, ‌కోమటిరెడ్డి వెంకట్‌ ‌నర్సింహారెడ్డి, కాట శ్రీనివాస్‌గౌడ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply