- మునిసిపాలిటీల్లోవి గ్రేటర్ లో చూపుతున్నారు
- లక్ష ఇండ్ల పేరుతో ప్రజల్ని ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు..:. భట్టి విక్రమార్క
గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష ఇండ్లను చూపిస్తామన్న ప్రభుత్వం, ఇండ్లు చూపించలేక పారిపోయిందని సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన శుక్రవారం అర్థాంతరంగా ఆగిపోవడం, మీకు చూపించలేమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం ఇందిరా భవన్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పటు చేశారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, వీ హనుమంతరావు, దాసోజు శ్రవణ్, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు అనిల్ కుమార్, ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, విక్రమ్ గౌడ్ లు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ….గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు వస్తున్న తరుణంలో.. ప్రజలను మరోమారు మోసం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు.
ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రెడీగా ఉన్నాయని ఎన్నికలు అవ్వగానే పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు రాగానే.. పేదలవాళ్ల అవసరాలు, ఇబ్బందులను ఆసరాగా చేసుకుని వారి ఓట్లను టీఆర్ఎస్ వేయించుకుని అసవరం తీరాక వారిని పక్కన పెట్టడం కేసీఆర్ కు ఆనవాయితీగా మారిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్ లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై వివిధ సందర్భాల్లో సభలో మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా భట్టి మీడియాకు చూపించారు. అందులో కేసీఆర్ హైదరాబాద్ పరిధిలో 2.60 లక్షల ఇండ్లను నిర్మిస్తామన్న వీడియోలను బట్టి మీడియాకు చూపారు. అలాగే హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్లు రెడీగా ఉన్నాయన్న మంత్రులు , కేటీఆర్, తలసాని మాటలను ఆయన మీడియాతో పంచుకున్నారు.
గతంలోనూ ఎన్నికలప్పుడు మోడల్ హౌస్ లను నిర్మించి వాటిని పేద ప్రజలకు చూపి మమ్మల్ని గెలిపిస్తే ఇలాంటి ఇండ్లను కట్టించి ఇస్తామని చెప్పి పేదలను మోసం చేశారని అన్నారు. ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలోని ఏ నియోకవర్గంలోనూ 4 వేల ఇండ్లను కట్టలేదని అన్నారు. ప్రభుత్వం చెప్పిన వివరాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 96 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టాల్సి ఉండగా.. కేవలం 3,428 మాత్రమే కట్టారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.లక్ష ఇండ్ల పేరుతో ప్రజల్ని ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదల్ని ఓట్ బ్యాంక్ చూడవద్దని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వానికి సూచించారు. అలాగే గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి పునాదిరాళ్లు వేసిన చోట.. త్వరగా నిర్మించి వాటి.