Take a fresh look at your lifestyle.

మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అ‌క్రమాలు

TRS irregularities in municipal elections kisan reddy

  • టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ మధ్యనే  ప్రధాన పోటీ
  • కెసిఆర్‌, ఓవైసీలు ఏకమైనా బిజెపిని అడ్డుకోలేరు
  • చౌటుప్పల్‌ ‌ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గెలుపుపై విశ్వాసం లేకనే బీజేపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్లమెంటు ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ మధ్యనే పోటీ నెలకొందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2026లో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేశారు. డబ్బులతో టీఆర్‌ఎస్‌.. ‌మోదీ పాలనతో బీజేపీ ఎన్నికల బరిలో దిగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం 3 లక్షల ఇళ్లు మంజూరు చేసినా.. ఒక్క ఇంటికి కూడా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం దరఖాస్తు చేయ లేదన్నారు. యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాల హయాంలో రాష్టాన్రికి ఇచ్చిన నిధులపై.. టీఆర్‌ఎస్‌ ‌శ్వేతపత్రం విడుదల చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. కేవలం ఎంఐఎం పార్టీపై మాత్రమే తమ పోరాటమని.. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదనీ కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ ‌మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌, ఓవైసీ బ్రదర్స్ ‌కలిసి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మెజార్టీ మున్సిపాలిటీ స్థానాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని… లక్ష మంది ఓవైసీలు, కేసీఆర్‌లు వచ్చినా బీజేపీ హవాను అడ్డుకోలేరని కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌, ‌మజ్లిస్‌ ‌లాంటి పార్టీలు, స్వార్థ శక్తులు ఎన్ని అడ్డుపడినా తెలంగాణలో బీజేపీ శక్తిని ఆపలేరని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హాలను విస్మరించిన సీఎం కేసీఆర్‌కు మునిసిపల్‌ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో, నాగర్‌కర్నూలులో నిర్వహించిన రోడ్‌షోల్లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు ఒరిగిందేలేదని, బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్‌ ‌తన కుటుంబాన్ని మాత్రమే బాగు చేసుకున్నారన్నారు. జన బలం లేని కేసీఆర్‌ ‌డబ్బు, అధికార బలంతో ఎలాగైనా గెలవాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కేంద్రం తెలంగాణకు 2 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నేటికీ వాటిని పూర్తి చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కాకుండా తండ్రీ కొడుకుల ప్రభుత్వం కొనసాగుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేవన్నారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకవైపు, బీజేపీ ఒకవైపని అన్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులను బెదిరిస్తూ టీఆర్‌ఎస్‌ ‌కుట్ర చేస్తుందని, ఇంత దిగజారుడు రాజకీయం ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఇచ్చిన హాలు నెరవేర్చకుండా పరోక్షంగా ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్‌ఎస్‌ ‌ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు ఓటర్లపై నమ్మకం లేదని కేవలం డబ్బు, ఎంఐఎం పార్టీ పైనే నమ్మకం ఉందన్నారు. 2014లో 2లక్షలు ఇళ్లు కట్టిస్తామని హా ఇచ్చారని, ఇప్పటి వరకు కేంద్రానికి ఒక్క లబ్దిదారుని పేరు కూడా పంపలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చించేందుకు కేటీఆర్‌ ‌తనకు ఎర్ర తివాచి పరుస్తా అన్నాడని, పేదలకు ఇళ్లు కట్టిసే తానే కేటీఆర్‌కు ఎర్ర తివాచి పరుస్తానని అన్నారు. బంగారు తెలంగాణ బదులు బంగారు కుటుంబం తయారైందన్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ధర్మానికి వేసినట్లేనని, టీఆర్‌ఎస్‌కు వేస్తే అవినీతికి వేసినట్లేనని తెలిపారు. ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌వంటి మంచి పథకాన్ని కేంద్రం ప్రవేశపెడితే తెలంగాణాలో అడ్డుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని ఓవైసీ అన్నాడని, లక్షమంది ఓవైసీలు వచ్చినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్నారు. ఆయన వెంట పలువురు బిజెపినేతలు పాల్గొన్నారు. బిజెపి వల్లనే అభివృద్దినల్లగొండ పట్టణంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది బీజేపీ హయాంలోనే జరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. నల్లగొండ మున్సిపాలిటీలోని ఓల్డ్ ‌సిటీలో కిషన్‌ ‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే లేకపోయినా నల్లగొండ అభివృద్ధి కోసం మోడీ అనేక నిధులు కేటాయించారని చెప్పారు. ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నల్లగొండకు చేసిందే లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ.. డబ్బు, అధికార దుర్వినియోగం, ఎం.ఐ.ఎం ద ఆధారపడి పోటీ చేస్తోందని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓ వైపు కల్వకుంట్ల కుటుంబం, మరోవైపు ఓవైసీ కుటుంబంలో తెలంగాణ బందీ అయ్యిందని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరి కబంద హస్తాలలో బందీ అయిన తెలంగాణను బీజేపీకి ఓటు వేసి విముక్తి చేయాలని ప్రజలకు కిషన్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.

Tags: trs vs bjp in municipal elections, kishan reddy campaign, nalgonda, choutuppal meeting

Leave a Reply