Take a fresh look at your lifestyle.

వరంగల్‌,‌ఖమ్మం కార్పోరేషన్‌లో టిఆర్‌ఎస్‌దే పైచేయి

  • జడ్చర్ల గడ్డపై టిఆర్‌ఎజ్‌ ‌జెండా
  • సిద్దిపేట,నకిరేకల్‌లో సంపూర్ణ మెజార్టీ

మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ ‌సత్తా చాటింది. దాదాపు అన్ని మున్సిపాలిటీలతో పాటు, రెండు కార్పోరేషన్‌లోనూ టిఆర్‌ఎస్‌ ‌పాగా వేసింది. వరంగల్‌, ‌ఖమ్మం కార్పోరేషన్ల తుది ఫలితాలు రావాల్సి ఉన్నాయి. గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ హవా కొనసాగుతుంది. మొత్తం 66 డివిజన్లకు గాను 27 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో టీఆర్‌ఎస్‌ 23 ‌డివిజన్లలో, బీజేపీ 3 డివిజన్లలో, కాంగ్రెస్‌ ఒక స్థానంలో గెలుపొందింది. వరంగల్‌ ‌రాంపూర్‌ ‌ఢిల్లీ పబ్లిక్‌ ‌స్కూల్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.

మొత్తం 66 డివిజన్లను 3 బ్లాకులుగా చేసి లెక్కింపును చేపట్టారు. ఏ బ్లాకులో 32, బీలో 21, సీలో 13 డివిజన్ల ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 132 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మున్సిపల్‌, ‌కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ హవా కొనసాగు తున్నది. జడ్చర్ల మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ జెండా ఎగురవేసింది. మొత్తం 27 వార్డుల్లో 19 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకు 16 వార్డుల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ ‌పార్టీ ఒకటి, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. జడ్చర్లలోని డిగ్రీ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని మొత్తం 27 వార్డులకు ఏప్రిల్‌ 30‌న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.

ఇకపోతే నకిరేకల్‌ ‌మున్సిపల్‌ ‌పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. నకిరేకల్‌ ‌మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 20 వార్డులకు గాను 11 వార్డులను టీఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకుని జయకేతనం ఎగురవేసింది. వార్డుల వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ‌కొనసాగుతున్నది. ఇప్పటివరకు 12 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 2, 4, 5, 13, 16, 17 వార్డుల్లో అధికారపార్టీ గెలుపొందింది. 2వ వార్డులో నిర్మల, 4వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి మిరాజ్‌ ‌బేగం 116 ఓట్లతో, 5వ వార్డులో లావణ్య, 13వ వార్డులో శివకృష్ణ, 16వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నరసింహ గౌడ్‌ ‌తన సవి•ప అభ్యర్థిపై 405 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, 17వ వార్డులో శ్రీనివాసులు గెలుపొందారు.

మున్సిపాలిటీలోని 1, 7, 10, 11, 14 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. అచ్చంపేటలోని జేఎంజే ఉన్నత పాఠశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఏప్రిల్‌ 30‌న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.సిద్దిపేట మున్సిపాలిటీలో కారు దూసుకుపోతోంది. గులాబీ జెండా ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 43 వార్డులకు గానూ ఇప్పటి వరకు 12 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఈ పన్నెండు వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ అభ్యర్థులు కనీసం పోటీ కూడా ఇవ్వలేదు.

Leave a Reply