ప్రజలను మోసం చేస్తున్న మంత్రి కెటిఆర్ పర్యటనను అడ్డుకుంటాం : కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వరంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం డిసిసి భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016 నుండి 19వరకు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి పట్ల ఏ మేరకు పని చేసిందో బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. 2016 నుండి ప్రతి సంవత్సరం రూ.300 కోట్ల వరంగల్ అభివృద్ధి కేటాయించా మని అనేకసార్ల టిఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టిఆర్ఎస్ పురపాలక శాఖ మంత్రి, ప్రస్తుత టిఆర్ఎస్ పురపాలక శాఖ మంత్రిగా వివరిస్తున్న కేటీ రామారావు జవాబు చెప్పాలని ఆయన అన్నారు. ఈనెల 17న వరంగల్‌కు వస్తున్న కెటి రామారావు 2016 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తాను ఇచ్చిన హామీలు ఈ మేరకు అమలు జరిగాయన్న విషయంపై వరంగల్ ప్రజలకు క్షమాపణలు చెప్పి వరంగల్ పొలిమేరలో అడుగుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ తర్వాత వరంగల్లు అభి వృద్ధి చేస్తామని కెటిఆర్ ఆచరణలో విఫలమ య్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.300 కోట్ల, స్మార్ట్ సిటీకి రూ.200 కోట్లు, హృదయ పథకం కింద రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పి ఐదేళ్ళు అవుతున్నా నగర అభివృద్ధి అద్వా నంగా ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కాకుండా వరంగల్ వస్తే పర్యటనను అడ్డుకుంటామని కెటిఆర్‌ను హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ అభివృద్ధి పట్ల కేటీఆర్ ను నిలదీయాలని ఇందుకుగాను 17న అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన సూచిం చారు.
వరంగల్ నగరంలో ఏ ఒక రోడ్డు కూడా సరిగ్గా లేదన్నారు. హన్మకొండ చౌరస్తాలో ఒక్క సారి కేటీఆర్ నిలబడి చూస్తే అభివృద్ధి ఏమేరకు ఉందో కేటాయించిన నిధులు ఎటు పోతున్నాయో వాస్తవం కళ్లకు కట్టినట్టుగా కనబడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా అభివృద్ధి చేయలేదని వరంగల్ ప్రజలకు క్షమాపణలు చెప్పి అభివృద్ధి చేసిన తర్వాత వరంగల్‌లో అడుగుపెడతానని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 41 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందని గతంలో ఇచ్చిన హామీలు కేటాయించిన నిధులు ఏ మేరకు విడుదల చేశారు బహిరంగ చర్చకు తాము సిద్ధమని నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఏడు నెలల్లో పాలకమండలి సమయం అయిపోతుం దని అభివృద్ధి మాత్రం శూన్యం అన్నారు. కూడా కు ప్రజలు కట్టిన డబ్బుతో భద్రకాళి బండ్ ఏర్పాటు చేశారని ఇంతకుమించి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వరంగల్ నగర అభివృద్ధి కార్యక్రమం జరగలేదని ఆయన అన్నారు. కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సమయము ఇయ్యాలని డిసిసి అధ్యక్షుడు నాయిని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ రావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, టిపిసిసి ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, టిపిసిసి కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్, సీనియర్ నాలయకుడు టి.రాంమోహన్ రావు, టిపిసిసి జాయింట్ సెక్రటరీ బిన్నీ లక్ష్మణ్, అర్బన్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, గ్రేటర్ మహిళా కాంగ్రెస్ ఛైర్మన్ బంక సరళ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మ రెడ్డి, బంక సంపత్, వరంగల్ వెస్ట్ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు తోట పవన్ తదితరులు పాల్గొన్నారు.