Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ ‌నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసం

  • విజయం కోసం కృషిచేసిన ప్రతికార్యకర్తకు ధన్యవాదాలు
  • అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఈ విజయం : మంత్రి కెటిఆర్‌ 

Opposition should repel allegations TRS working president KTR

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి భారీ విజయం అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వాన్ని ప్రజలు మరోసారి బలపరిచారు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నుంచి ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాం. 2014 నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. మున్సిపల్‌ ‌మంత్రిగా ఈ ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని కేటీఆర్‌ ‌చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం కోసం కృషిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.100కు పైగా మున్సిపాలిటీల్లో విజయం సాధించడం గొప్ప విషయం అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఇదంతా కెసిఆర్‌ ‌నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసమని అన్నారు. ఇదిలావుంటే రాష్ట్రంలో మున్సిపాలిటీలల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ స్పష్టమైన ఆధిక్యత నమోదు చేసింది. అత్యధిక మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ ‌పార్టీనే కైవసం చేసుకుంది.

అయితే.. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల సరళిపై పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌‌తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో కలిసి సక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడూ ఫలితాలను తెలుసుకున్నారు. ఇక మేయర్‌, ‌ఛైర్‌పర్సన్‌ ఎన్నికల నేపథ్యంలో ఎక్స్ఆఫిషీయో ఓట్లపై కేటీఆర్‌ ‌చర్చించారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఎక్స్ఆఫిషీయో ఓటును ఎక్కడ నమోదు చేసుకోవాలో ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. కార్పొరేషన్‌ ‌మేయర్‌ ‌లేదా మున్సిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ఎన్నికకు ఎక్కడైనా మెజార్టీ తక్కువైతే అక్కడ తమ ఎక్స్ఆఫిషీయో ఓట్లు ఉండేలా నమోదు చేసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీనిపై ఎంపీలు, ఎమ్మెల్సీలకు కేటీఆర్‌ ‌దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌కు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

పార్టీ శ్రేణులకు కవిత అభినందనలు
మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ ‌చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడిన ప్రతి టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తకు కవిత అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ ‌విజయం సాధించింది.

Tags: ex mp kalvakuntla kavitha,municipal elections, trs party, minister ktr

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply