- కాంగ్రెస్‌లో పివికి సమున్నత గౌరవం
- ప్రధానికి మించిన గౌరవం ఏముంటుంది
- పార్టీలో అంతర్గత కలహాలు సరికాదు
- పిసిసి చర్యలు తీసుకోవాలి
- కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి
పీవీ నరసింహారావును దేశానికి ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ అని, అంతకంటే గౌరవం ఇంకేముంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. పివికి కాంగ్రెస్ ఇచ్చిన గౌరవం ఎవరూ ఇవ్వలేదన్నారు. పీవీ కూతురికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వడం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. తెలంగాణలో వివిధ హోదాలలో 4.90 లక్షల ఉద్యోగాల కల్పన సృష్టించింది కాంగ్రెస్సేనన్నారు. ఈ ఏడేళ్లలో ఉన్న ఖాళీలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు. రెండేళ్లు పూర్తయినా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌పై నిందలు వేస్తున్నారన్నారు. 30 ఏళ్ల కింద అమ్మిన ఇళ్లకు కూడా భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. 20 నుంచి 30 ఊర్ల పేర్లు చెబుతానని.. అక్కడికి వి•డియా వెళ్లి భగీరథ నీళ్లు వస్తున్నాయో లేదో చూడాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు ఐక్యతగా పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని జానారెడ్డి పిలుపు ఇచ్చారు. గురువారం ఆయన మిడియా సమావేశంలో మాట్లాడుతూ నాయకుల మధ్య ఎవరికైనా భేదాభిప్రాయాలు ఉంటే.. అలాగే పార్టీ పద్ధతుల్లో ఉన్నా పార్టీ ఫోరమ్స్‌లో చర్చించి.. పరిష్కరించుకుని సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ మధ్య కాలంలో నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నట్లు తనకు తెలిసిందన్నారు. గ్రూపులతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందన్నారు. సోషల్ మిడియాలో దుష్పచ్రారాలు సరికాదని, నాయకులను టార్గెట్ చేసి పోస్టులు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు.
అలాగే పార్టీని బలహీనపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని, పీసీసీ స్పందించకపోతే.. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని జానారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మిడియాలో దుష్ప్రచారాలు సరికాదని, నాయకులను టార్గెట్ చేసి పోస్టులు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. అలాగే పార్టీని బలహీనపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని, పీసీసీ స్పందించకపోతే.. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని జానారెడ్డి స్పష్టం చేశారు. నేతలు పార్టీ వీడటానికి కారణం కాంగ్రెస్ పార్టీలో లోపం కాదని, సమాజంలో ఉందని జానారెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేసే తప్పులను చాలాసార్లు హెచ్చరించామని.. ప్రభుత్వం వింటే కదా అని జానారెడ్డి అన్నారు. ప్రజలు మాకు గుణపాఠం చెప్పినట్లే.. వాళ్లకూ చెబుతారని, వచ్చే ఎన్నికల నాటికి తిరగబడతారని జానారెడ్డి వెల్లడించారు.