Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో అల్లర్లకు టిఆర్‌ఎస్‌ ‌కుట్ర

గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న లక్ష్మణ్‌
‌శాంతి భద్రతలపై సీఎం కేసీఆర్‌, ‌డీజీపీ ప్రకటనపై బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసైను కలిశారు. ఎన్నికల్లో లబ్ది కోసమే శాంతిభద్రతలు తెరపైకి తెచ్చారని.. బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్‌ ‌నేత లక్ష్మణ్‌ ‌డియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ‌కుట్రలను గవర్నర్‌కు వివరించామని అన్నారు. వోటర్ల జాబితా నుంచి దొంగ వోట్ల వరకూ టీఆర్‌ఎస్‌ అ‌క్రమాలకు పాల్పడుతోందన్నారు. హైదరాబాద్‌లో అల్లర్లు జరగాలని టీఆర్‌ఎస్‌ ‌కోరుకుంటోందన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించి.. ఎన్నికలు వాయిదా వేయాలని టీఆర్‌ఎస్‌ ‌చూస్తోందన్నారు. అమిత్‌ ‌షా వస్తే.. టీఆర్‌ఎస్‌కు ఎందుకు భయమని ప్రశ్నించారు.

ఓల్డ్‌సిటీలో మజ్లిస్‌ ‌పార్టీని పేద ముస్లింలు కూడా వ్యతిరేకిస్తున్నారని లక్ష్మణ్‌ ‌పేర్కొన్నారు. బీజేపీ నేతలు రామచందర్‌ ‌రావ్‌, ‌చింతల రామచంద్రారెడ్డిలతో కలసి గవర్నర్‌ ‌ని కలిశారు. ఓటమి భయం తో శాంతి భద్రతల సమస్య పేరుతో, ఎన్నికల వాయిదా వేసేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోంది.. వెంటనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. కేంద్ర బలగాలు తీసుకురావాలని గవర్నర్‌ని కోరామని తెలిపారు. హైదరాబాద్‌లో అల్లర్లు జరగాలని తెరాస కోరుకుంటుంది. వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు ఎన్నికలు తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది అన్నారు. శాంతి భద్రత ల సమస్య సృష్టించే వారిని వెంటనే అరెస్టు చేయాలి. బీజేపీ ప్రచారాన్ని చూసి ఎందుకు తెరాస, కేటీఆర్‌ ఉలిక్కిపడుతున్నారని పేర్కొన్నారు. రు గల్లికో మంత్రిని ఎమ్మెల్యేను పెట్టి ప్రచారం చేయడం లేదా.. ప్రచారానికి దావూద్‌ ఇ‌బ్రహీంని, బిన్‌ ‌లాడెన్‌ ‌పిలుచుకోండి అని సూచించారు. తమ నేతలు ప్రచారానికి వొస్తే వారికెందుకు నొప్పి అని లక్ష్మణ్‌ ‌ప్రశ్నించారు.

Leave a Reply