Take a fresh look at your lifestyle.

జీహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌కుట్రలను.. ప్రజలు తిప్పికొడతారు

ఆ పార్టీకి 25 సీట్ల కంటే ఎక్కువ రావు
:బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అబద్దాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో ఆ పార్టీ కుట్రలను ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు. శనివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద సాయం నిలిపివేతపై తాను రాసినట్లుగా చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి పిలిస్తే సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు రాలేదని ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి ఆలయంలో కాకుండా పక్కనే ఉన్న మక్కా మసీదులో ప్రమాణం చేసినా బాగుండేదని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో తమ పార్టీ అత్యధిక స్థానాలలో గెలిచి మేయర్‌ ‌స్థానాన్ని కైవసం చేసుకుంటే గతంలో రూ. 10 వేలు పొందిన వరద బాధితులకు అదనంగా ఇస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌ ‌నగరంలోని హిందువులను వెళ్లగొట్టడమే టీఆర్‌ఎస్‌, ‌మజ్లిస్‌ )‌క్ష్యమనీ ఆ రెండు పార్టీలు రోహింగ్యాల గురించి మాట్లాడినప్పుడు 80 శాతం ఉన్న హిందువుల గురించి తమ పార్టీ మాట్లాడితే తప్పా ? అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో 25 స్థానాలు గెలిచి మేయర్‌ అవుతామని టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రే అన్నారనీ, దీంతో 25 స్థానాలకంటే ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే పరిస్థితి లేదని వొప్పుకున్నట్లే కదా అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో 25 కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గ్రేటర్‌లో వాహనదారుల చలాన్లు కడతామని చెబితే టీఆర్‌ఎస్‌ ‌నేతలు తమను విమర్శిస్తున్నారనీ, అయితే, తాము ఎక్కడా నిబంధనలను అతిక్రమించలేదని స్పష్టం చేశారు.

బీజేపీ జీహెచ్‌ఎం‌సి ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర మంత్రి జవడేకర్‌ ‌విడుదల చేస్తారని తెలిపారు. పాతబస్తీలో బకాయిలు వసూలు చేయలేని స్థితిలో అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వుందనీ, ముందుగా అక్కడ బకాయిలు వసూలు చేసిన తరువాతనే వోట్లు అడగాలని సవాల్‌ ‌విసిరారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఉన్న ఎమ్మెల్యేలనే • కాపాడుకోలే పోతున్నదనీ, అలాంటిది గెలిచిన కార్పొరేటర్లు అదే పార్టీలో ఉంటారనే నమ్మకం ఏమిటని బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు.

Leave a Reply