Take a fresh look at your lifestyle.

నేరెడ్‌మెట్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు

782 వోట్ల మెజార్టీతో మీనా ఉపేందర్‌ ‌రెడ్డి విజయం

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లో నిలిచిపోయిన నేరెడ్‌మెట్‌ ‌ఫలితం బుధవారం ఉదయం వెల్లడయింది. నేరెడ్‌మెట్‌ 136‌వ డివిజన్‌లో 782 వోట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మీనా ఉపేందర్‌ ‌రెడ్డి గెలిచారు. 4న కౌంటింగ్‌ ‌సందర్భంగా టెక్నికల్‌గా నిలిచిపోయిన నేరెడ్‌మెట్‌ ‌డివిజన్‌ ‌వోట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వడంతో.. బుధవారం ఉదయం 8 గంటలకు వోట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. సైనిక్‌పురిలోని భవాన్స్ ‌వివేకానంద కాలేజీలో లెక్కింపు జరిగింది. హైకోర్టు తీర్పుతో ఇతర గుర్తులున్న 544 వోట్లను బుధవారం ఉదయం లెక్కించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 782 వోట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 544 వోట్లలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి 278, బీజేపీకి 115, కాంగ్రెస్‌ ‌పార్టీకి 111 వోట్లు పోలయ్యాయి.

నేరెడ్‌మెట్‌ ‌డివిజన్‌ ‌మొత్తంలో 25,176 వోట్లు పోలవ్వగా 24,632 వోట్లు లెక్కించారు. డిసెంబర్‌ 4‌న లెక్కించిన వాటిలో 504 వోట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. స్వస్తిక్‌ ‌గుర్తు కాకుండా ఇతర ముద్ర ఉన్న వోట్లను లెక్కించాలని ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌పై రాష్ట్ర బీజేపీ లీగల్‌సెల్‌ ఇన్‌చార్జి హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేయగా.. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. స్వస్తిక్‌ ‌మార్క్ ‌కాకుండా ఇతర మార్కులను ఉపయోగించి బ్యాలెట్‌ ‌పేపర్‌పై వోటు వేసినప్పుడు ఎన్నికల నియమాలు, 2005 రూల్‌ 51 ‌ప్రకారం రిటర్నింగ్‌ అధికారికి తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఎస్‌ఈసీ తెలుపగా సమర్థించిన కోర్టు వివాదాస్పద వోట్లను లెక్కించాలని ఆదేశించింది. దీంతో వోట్లను లెక్కించి ఫలితం ప్రకటించడంతో టిఆర్‌ఎస్‌ ‌గెల్చుకుంది. దీంతో టిఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది.

Leave a Reply