Take a fresh look at your lifestyle.

దిల్ల్లీలో టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల కొత్త నాటకం

  • ధాన్యం కొనుగోళ్లపై కలిసి డ్రామాలు
  • కెసిఆర్‌ అవినీతిపై ఆధారాలు ఉంటే ఎందుకు విచారించరు?
  • ధాన్యం కొనుగోళ్ల కుంభకోణంపైనా విచారణ చేయాలి
  • రాక్షస క్రీడలో అమాయక రైతులు బలి అవుతున్నారు
  • దిల్లీలో వి•డియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌
  • ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ అవినీతిపై సీవీసీ, సీబీఐతో విచారణ జరిపించాలి : ఎంపి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 22 : ‌పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు డ్రామాలాడారని, ఇప్పుడు దిల్లీలో బైఠాయించి కొత్త డ్రామాలకు తెరలేపారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌కలిసి డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ వి•డియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ‌నేతలు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. మోదీ నాయకత్వాన్ని సమర్థించడానికే.. పార్లమెంటు సమావేశాలు బహిష్కరించి గ్రామాలకు వెళ్లారని విమర్శించారు. యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలని కోరలేదన్నారు. వానాకాలం పంట కొంటామని కేంద్రం ముందే చెప్పిందన్నారు. ఏప్రిల్‌లో వొచ్చే పంట కొనుగోలే రైతుల అసలు సమస్యని వొచ్చే పంటను కొంటారో లేదో కనుక్కొలేకపోయారని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు.

ఇంతకన్నా దారుణం లేదన్నారు. పార్లమెంటులో కాకుండా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నేతలు ఢిల్లీలో వీధి నాటకాలు మొదలు పెట్టారన్నారు. గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల రాక్షస క్రీడలో అమాయక రైతులు బలి అవుతున్నారన్నారు. ఢిల్లీలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌నాయకులు తెలంగాణ ప్రజల పరువు తీస్తున్నారన్నారు. తన  దగ్గర అన్ని వివరాలు ఉన్నాయన్న అమిత్‌ ‌షా కేసీఆర్‌ ‌కుటుంబ అవినీతిపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌కు మధ్య ఉన్న అనుబంధం, ఒప్పందం బహిర్గతం చేయాలన్నారు. బండి సంజయ్‌, ‌కిషన్‌ ‌రెడ్డిలు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారన్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేసీఆర్‌ అమిత్‌ ‌షా డైరెక్షన్‌లో రాజకీయ నాటకాలు ఆడుతున్నారన్నారు. కేసీఆర్‌ ‌తన వ్యూహాల విద నమ్మకం కోల్పోయి, సునీల్‌ అనే రాజకీయ వ్యూహకర్త డైరెక్షన్‌లో నడుస్తున్నారన్నారు. సునీల్‌ అనే వ్యూహకర్త బీజేపీ టీఆర్‌ఎస్‌లకు నాయకుడిగా మారారన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ అవినీతిపై సీవీసీ, సీబీఐతో విచారణ జరిపించాలని ఎంపి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో జరిగిన అవినీతి బాగోతం అందరికీ తెలుసని..అయినా కేందప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. తామంతా లఖింపూరి ఘటనపై పార్లమెంటులో ఆందోళన చేస్తుంటే, కావాలనే స్పీకర్‌ ‌పోడియంముందు ఆందోళన చేసి ప్రభుత్వానికి సహకరించారని అన్నారు.

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ ‌మధుయాష్కీ గౌడ్‌ ‌మాట్లాడుతూ కనీస మద్దతు ధర కూడా రైతులకు అందడం లేదని  మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు లేక..అకాల వర్షంతో రైతులు రూ.1300, రూ.1400కే వరి ధాన్యాన్ని రైస్‌ ‌మిల్లర్లుకు అమ్ముకున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చెబుతున్న 53 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతుంది. ఈ ధాన్యం మొత్తాన్ని రైస్‌ ‌మిల్లర్ల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలుస్తుందన్నారు. రైస్‌ ‌మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.1940తో కొనుగోలు చేసింది. రైస్‌ ‌మిల్లర్లు మాత్రం రైతులను మోసం చేసి మూడు, నాలుగు వందల రూపాయల తక్కువ ధరకు తీసుకుందని దుయ్యబట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం రూ.18 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే రూ.18 వేల కోట్ల కుంభకోణంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. లేకపోతే ఇటు టీఆర్‌ఎస్‌..అటు బీజేపీ  నాయకులు తెలంగాణ రైతుల కష్టార్జితాన్ని రూ.18వేల కోట్లను మెక్కినట్లుగా తెలుస్తుందని మధుయాష్కీ గౌడ్‌ ఆరోపించారు. వి•డియా సమావేశంలో ఎంపి కోమటిరెడ్డి కూడా మాట్లాడారు.

Leave a Reply