Take a fresh look at your lifestyle.

టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ రహస్య ఒప్పందం ..!

  • కేసిఆర్‌ ‌చర్యలతో రైతులకు తీవ్ర నష్టం
  • కేంద్ర భయంతో వ్యవసాయ చట్టాల అమలు
  • కాంగ్రెస అవిర్భావం సందర్బంగా జెండా ఎగురేసిన ఉత్తమ్‌

‌తెలంగాణ ఇచ్చింది..స్వాతంత్య్రం తెచ్చిందీ కాంగ్రెస్‌ ‌పార్టీయేనని పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ మాత్రమే ఈ దేశంలో ఆర్తిక స్థితిగతులను పెంచిందనిదేశంలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కాంగ్రెస్‌ ‌మాత్రమే ప్రజల సంక్షేమం  కోరే పార్టీ అని ఆన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పరుస్కరించుకుని గాంధీభవన్‌లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కేసీఆర్‌ ఒక తుగ్లక్‌లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చెప్పిన పంటలే వేయాలని రైతులను ఇబ్బందులు పెట్టారు. మళ్లీ ఇప్పుడు ఇష్టం వచ్చిన పంటలు వేసుకోవచ్చు అంటున్నారు. నియంత్రిత సాగుపై మొదటి నుండి చెప్తూనే ఉన్నాం కానీ వినలేదు.

పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యం కాదని  చెప్పడం మంచిది కాదన్నారు. కావాలనే కేంద్రం ఆదేశాలకు తలొగ్గి వ్వయసాయ చట్టాలను అమలు చేయాలని నిర్ణయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలుపంటల మద్దతు ధరలు యధావిధిగా కొనసాగాలన్నారు. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేదంటే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు.  టీఆర్‌ఎస్‌‌బీజేపీ రెండూ ఒక్కటే.. రెండూ రహస్య ఒప్పందం చేసుకున్నాయి. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై కేసీఆర్‌ ‌మాట మార్చారు. పీసీసీ చీఫ్‌ ‌విషయంలో అధిష్టానం నిర్ణయమే తుది అని,  అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. ఇకపోతే  సీఎం కేసీఆర్‌ ‌చర్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీమంత్రికాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. రైతులకు ద్రోహం చేస్తున్న కేసీఆర్‌కు పరాభవం తప్పదని.. ఆయన శేషజీవితం చర్లపల్లి జైలులోనే ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నియంత్రిత పంటల సాగంటూ హడావిడి చేసిన సిఎం కెసిఆర్‌ ఇప్పు‌డు ఎందుకు యూ టర్న్ ‌తీసుకున్నారని ప్రశ్నించారు. అలాగే పండించిన సన్నాలకు ఎందుకు మద్దతు ధరలు చెల్లించడం లేదన్నారు. కేంద్రంతో భయం కారణంగా కొత్త వ్యవసయా చట్టాలను అమలు చేయాలని చూస్తున్నారని అన్నారు. ఇకపోతే ధాన్యం కొనుగోలుకు 7000కోట్లు నష్టం వచ్చిందనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ద్రోహిగా కేసీఆర్‌ ‌చర్యలున్నాయని విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట మరో లక్ష కోట్లు అదనంగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. నీటిపారుదలపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ ‌విసిరారు. టీఆర్‌ఎస్‌ ‌నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్దికి టీఆర్‌ఎస్‌ ‌చేసింది శూన్యమని తూర్పార బట్టారు.

Ponnala lakshmaiah fire on kcr

కేసీఆర్‌ ‌సీఎం అయ్యాక తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజలకు హానీ చేసేవే అని పొన్నాల లక్ష్మయ్య దుయ్యబట్టారు.  కేసీఆర్‌కు ప్రజలు తగిన శిక్ష విధించడం ఖాయం. మిషన్‌ ‌భగీరథకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశావు కదా! నీళ్లు ఇచ్చావా?. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి రెండు ప్రాజెక్టులకు లక్ష కోట్లకుపైగా ప్రభుత్వం సొమ్ము ఖర్చు చేశారు.ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. కేసీఆర్‌ ‌రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతారు. కేసీఆర్‌ ‌తీసుకునే 90 శాతం నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల పాలు చేసేవే. కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడాన్ని.. ప్రజల్లో ఎండగడుతామని అన్నారు.  కేసీఆర్‌‌బీజేపీ ఆడే నాటకాలతో.. ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. కేసీఆర్‌ ‌శేష జీవితం చర్లపల్లి జైలు లోనే అని పొన్నాల అన్నారు.

కెసిఆర్‌ ‌ముసుగు తొలగిపోయింది
కేంద్ర వ్వయసాయ చట్టాలకు వత్తసు: జీవన్‌ ‌రెడ్డి

కేంద్ర తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలనుసమర్థించడం కోసమే  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మరోమారు తన నిర్ణయాలను యూ టర్న్ ‌తీసుకున్నారని  కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామని చెప్పడంపై  అభ్యంతరం వ్యక్తం చేసిన జీవనర రెడ్డి .. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు.. చరిత్రలోనే నూతన వ్యవసాయ చట్టం నల్ల మచ్చగా పేర్కొన్న జీవన్‌ ‌రెడ్డి.. రైతుల జీవితాలు తాకట్టు పెట్టేవిదంగా కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు ఉంటే.. అది ఒక గొప్ప చరిత్రాత్మక నిర్ణయంగా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. సాగునీరు పేరుతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా కేసీఆర్‌ ‌మార్చేశారని మండిపడ్డ జీవన్‌ ‌రెడ్డి… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిజరూపం ఏంటో ఇప్పుడు బయటపడిందన్నారు.

 కేసీఆర్‌ ‌ముసుగు తొలిగిపోయింది, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మేక వన్నె పులిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలను కాపాడుకోవడానికి మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెడ్తున్నావు… అంటూ ‌ అయిన ఇదేనా నువ్వు ఢిల్లీకి పోయి కుదుర్చుకున్న ఒప్పందం..? అంటూ ఆయన.. ప్రశ్నించారు.. తెలంగాణ రాష్ట్ర రైతుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టిన కేసీఆర్‌కు పుట్టగతులుండవంటూ హెచ్చరించారు జీవన్‌ ‌రెడ్డి.

Leave a Reply