Take a fresh look at your lifestyle.

రైతుల జీవితాలతో టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల చెలగాటం

  • రైతుల పాలిట మరణశాసనంగా కేసీఆర్‌ ‌సంతకం
  • వడ్లను కనీస మద్దతు ధర రూ.1960 కొనాలి
  • ప్రభుత్వాల తీరుకు నిరసనగగా నేడు, రేపు ధర్నాలు
  • రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చారు…
  • డ్రగ్స్ ‌కేసులతో సినిమాను గుప్పిట్లో పెట్టుకున్న కెటిఆర్‌
  • ‌మండిపడ్డ పిసిసి అధ్యక్షడు రేవంత్‌ ‌రెడ్డి

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలు రెండు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడు తున్నాయని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల జీవితాలతో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ చెలగాటం ఆడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ ‌చేసిన సంతకం రైతుల పాలిట మరణశాసనంగా మారిందన్నారు. బాయిల్డ్ ‌రైస్‌ ‌సరఫరా చేయబోమని…కేంద్రంతో కేసీఆర్‌ ‌చేసుకున్న ఒప్పందం గుదిబండగా మారిందని రేవంత్‌ ‌పేర్కొన్నారు. వడ్లను కనీస మద్దతు ధర రూ.1960తో కొనాలని డిమాండ్‌ ‌చేశారు. కొన్న వడ్లను ఏం చేసుకుంటారో వారి ఇష్టమన్నారు. రైతులను మోసం చేయడానికి సమస్యను జఠిలం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీసేందుకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసన, 7న హైదరాబాద్‌లోని విద్యుత్‌ ‌సౌధ ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. రైతుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం దిల్లీ తెలంగాణ భవన్‌లో రేవంత్‌ ‌రెడ్డి విడియాతో మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్‌ ‌విరుచుకుపడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలాడుతున్నాయన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రెండు పార్టీలు రైతులను మోసం చేశాయన్నారు.

2022 లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న బీజేపీ.. కనీసం వడ్లు కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. రా రైస్‌ ‌మాత్రమే కొంటామని కేంద్రం, లేదు లేదు బాయిల్డ్ ‌రైస్‌ ‌కొనాలని రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం తిట్టుకుంటూ పెద్ద డ్రామాకు తెరలేపాయన్నారు. వరికి రూ.1960 కనీస మద్ధతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ ‌చేశారు. కేసీఆర్‌ ‌మిల్లర్లతో కుమ్మక్కయ్యారని, అందుకే కొనుగోలు కేంద్రాలను ఎత్తేశారన్నారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేయడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లర్లను సంప్రదించాల్సి వొస్త్తుందన్నారు. ఈ క్రమంలోనే మిల్లర్లు ఇష్టమొచ్చినట్టు ధర నిర్ణయిస్తూ దోపిడికి పాల్పడుతున్నారన్నారు. దమ్ముంటే రైతులను దోచుకుంటున్న మిల్లర్లపై పీడీ యాక్ట్ ‌నమోదు చేసి జైల్లో పెట్టాలని సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ ‌సవాలు విసిరారు.

రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చారు…డ్రగ్స్ ‌కేసులతో సినిమాను గుప్పిట్లో పెట్టుకున్న కెటిఆర్‌
‌డ్రగ్స్ ‌హబ్‌గా రాష్టాన్న్రి మార్చేసే కుట్రకు కేసీఆర్‌ ‌కుటుంబం పూనుకుందని రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ‌బంజారాహిల్స్‌లో సంచలనం సృష్టించిన పబ్‌ ‌డ్రగ్స్ ‌వ్యవహారంపై  రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని.. డ్రగ్స్ ‌కేసులో తన కుటుంబ సభ్యులను తప్పించాలని తాను కోరినట్లు కొందరు అసత్య ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మేనల్లుడు డ్రగ్స్ ‌తీసుకున్నాడో లేదో తెలుసుకునేందుకు శ్యాంపిల్స్‌కు పంపిస్తానని…సీఎం కేసీఆర్‌ ‌కేటీఆర్‌ ‌శ్యాంపిల్స్‌కు పంపిస్తారా అని సవాల్‌ ‌విసిరారు. సీబీఐ, ఈడీ, సిట్‌తో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేశారు. పబ్‌లో పట్టబడిన వారిలో డ్రగ్స్ ‌తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి వారి శ్యాంపిల్స్ ఎం‌దుకు సేకరించలేదని ప్రశ్నించారు. తన బంధువుల నమూనాలను ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. చదువుకునే పిల్లలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. గతంలో రాష్ట్రంలో డ్రగ్స్ ‌వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించానని..కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశానని చెప్పారు.

రాష్ట్రంలో డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని పోరాడానన్నారు. డ్రగ్స్ అడ్డుపెట్టుకుని సినిమా రంగంపై కేటీఆర్‌ ‌పట్టు సాధించారన్నారు. అసలు డ్రగ్స్ ‌తీసుకున్న వారిని వదిలి పెట్టి , తమ పిల్లల పై ఆరోపణలు చేయడం ఏంటని ధ్వజమొత్తారు.రాష్ట్రంలో 24 గంటలు మద్యం, పబ్బులు నడుపుకోమని పర్మిషన్‌ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాదా అని నిలదీశారు.

Leave a Reply