Take a fresh look at your lifestyle.

‌సాగర’’ మథనంలో అమృతం భాజపాకు దక్కకుండా తెరాస – కాంగ్రెస్‌ ‌వ్యూహం

తెలంగాణలో సాగర్‌ ఉప ఎన్నిక రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులతో అసలే వేడెక్కిన వేసవి వాతావరణాన్ని మరింత వేడెక్కించి రసకందాయంగా తయారైంది. పార్టీలు తమ అభ్యర్ధుల పకటన నామినేషన్ల దాఖలు, పరిశీలన పూర్తై ప్రచారం ఊపందుకోవడంతో రాష్ట్ర ప్రజల కళ్ళన్నీ సాగర్‌ ‌పై కేంద్రీకృతమై విజేత ఎవరన్న ఉత్సుకత ఏర్పడింది. నియోజకవర్గంలో పాతకాపు, జనాలకు చిరపరితుడైన అనుభవజ్ఞ నేత కె జానారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీదారులందరికంటే అన్నింటా ముందున్నారనడంలో సందేహం లేదు. జానారెడ్డి రంగంలో దిగగానే ఆ స్థానం చేజిక్కించుకునే ఎత్తుగడలో ముఖ్య మంత్రి, తెరాస అధినేత కె చంద్రశేఖర్‌ ‌రావు  గుంభనంగా తలమునకలయ్యారు.

ఎన్నికలలో గెలుపు ఒక విషయం కాగా, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీని అడుగు ముందుకు వేయనీయకుండా నిలవరించాలన్న భగీరథ ప్రయత్నంలో కెసీఅర్‌ ‌నిమగ్నమయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి, ఎప్పుడూ జనాల నాలుకలపీ నర్తించే నాయకుడు జానారెడ్డి పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానమే నేరుగా ప్రకటించడం పార్టీలో ఆయనకున్న పట్టును మరో సారి బహిర్గతం చేసింది. దాదాపు నెలగా ఆయనే సాగర్‌ అభ్యర్ధి అనే  ప్రచారంతో పాటు ప్రజలలో మమేకమవుతూ ప్రచారానికి ఎప్పుడో శ్రీకారం చుట్టి, అభ్యర్ధులెవరో మొన్నటివరకు ప్రకటించని తెరాస, భాజపా లకంటే ముందడుగులో ఉన్నారు. ఈ పర్యాయం ఆయన కొత్త వ్యూహంతో బాణం సంధించారు.

తమ అభ్యర్ధి సామర్ధ్యం గుర్తించి ప్రజలు తమకు ఎవరు మేలు చేస్తారో వారినివిజ్ఞతతో ఎన్నుకునే పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రం ఇస్తూ, ఓటర్లను ప్రలోభాలతో ప్రభావితం చేయకుండా ప్రచార ఆర్భాటాలు లేకుండా దబ్బు, మద్యం, తిండివంటి పంపిణి,  అభ్యర్ధులు, వారి పార్టీలు గృహాలకే పరిమితమవుదామని సూచిస్తూ.. అందరూ అంగీకరిస్తే తాను కాలు కదపనని జానారెడ్డి  ఒక సవాలువంటి సూచన చేసారు. ఇదే కార్య రూపం దాలిస్తే, ప్రజాస్వామ్యంలో ఓతు విలువ పెరుగుతుందని అందరకూ ఆదర్శమవుతామని అన్నారు. తాజాగా దుబ్బాక, జి హెచ్‌ ఎం ‌సి, రెండి ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార తెరాస వరుస ఓటములు, నువ్వానేనా అన్నట్లు పోటీ నేపథ్యంలో ఈ ఎన్నికను మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తెరాస భారీగా శ్రేణులనురంగంలోకి దించి, దబ్బు పంపిణికి సిద్ధపడ్తున్నదంటూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తెరాసకు ఎన్నికల పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌ ‌తోనా, భాజపా తోనా అనే అనే ప్రశ్న ప్రజలలో చక్కర్లు కొట్టడంతో ఈ రెంటినీ సమర్ధంగా ఎదుర్కోనే సవాలు తెరాస కు ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్స్ ‌దాదాపు శూన్య స్థితికి చేరిందని, తెలుగుదేశం ఎప్పుడో కనుమరుగయిందని, కానీ నూతన శక్తిగా ఎదుగుతున్న భాజపా కొరకరాని కొయ్యగా మారిందన్న అభిప్రాయం తెరాస అధినేత నుంచీ కార్యకర్త వరకు దృఢాభిప్రాయం పాతుకుపోయిన మాట వాస్తవం. అయితే అటు భాజపా కాని, ఇటు తెరాస కానీ జానా ను ఢీకొనడం సాధారణ విషయం కాదని ఒక వాదన వినిపిస్తున్నది. తెరాసా పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూనే కాంగ్రెస్‌ అభ్యర్ధి కంటే భాజపా అభ్యర్ధే ప్రధాన శత్రువుగా పరిగణించి భవిష్యత్తును మరింత భద్రంగా ఉంచుకునే లక్ష్యంతో కెసీఅర్‌ ‌పావులు కదుపుతున్నట్లు సమాచారం.

తెలంగాణా ఆవిర్భావం నుంచీ మొన్నటి దుబ్బాక ఉపేన్నిక వరకూ అదురు బెదురు లేకుండా ఏకచ్ఛాత్రాధిపత్యం గా విజకేతనం ఎగురవేస్తూ ప్రజా వ్యతిరేకతకు తావులేకుండా వస్తున్న తెరాస కు దుబ్బాక ఉప ఎన్నిక, ఆ వెంటనే జి హెచ్‌ ఎం ‌సీ ఎన్నికలలో భాజపా స్పీడ్‌ ‌బ్రేకర్‌ ‌లా తయారైంది. భాజపా రాష్ట్ర కేంద్ర నాయకత్వాలు తమ భవిషత్‌ ‌దృష్టిని తెలంగాణపై కేంద్రీకరించి గోల్కొండ ఖిల్లా పై కాషాయ పతాకం ఎగురవేయాన్న పట్టుదలతో వడి వడి అడుగుల వేగం, వేడి పెంచింది. తెరాస కు ఎక్కడికకక్క్డ కంటిలో నలుసు, పంటికిందరాయిలా తయారైంది. కాంగ్రెస్‌ ‌చరిత్రకు చరమగీతం పాడామనుకుంటున్న తెరాసకు భాజపా కొరక రానికొయ్యయి చికాకు కలిగిస్తున్నది. దానికి తోడు ఇటీవల శాసన మండలి పట్టభద్రుల రెండు నియోజకవర్గాలకు  జరిగిన ఎన్నికల్లో భాజపా తెరాసకు నిద్రపట్టకుండా చేసి ప్రత్యర్ధి తానేనని రుజువు చేసుకుంది.  ఈ వాతావరణ్ణన్ని తెరాస ప్రత్యర్ధి పార్టీలు సదవకాశంగా తీసుకుని ప్రభ్త్వ వ్యతిరేకత అగినికి ఆజ్యం పోసాయి.

ఇటీవలి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో  భాజపా మరింతగా శక్తియుక్తులను తెరాస పై ప్రయోగించడానికి ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రజలలో ప్రతి విష్యంలో నిగూఢంగా గూడుకట్టుకున్న అసంతృప్తిని ప్రభుత్వ వ్యతిరేకతగా మార్చుకుని తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నది. బాజపా స్పీడును నివారించడమే కెసీఅర్‌, ఆయన తరువాతి స్థానంలో ఉన్న ఆయన కుమారుడు కెటీఅర్‌ ‌ముందున్న సవాలు. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకున్నా , ముందు జాగ్రత్త అవసరమని సాగర్‌ ఎన్నికలో తమ గెలుపెంత ముఖ్యమో భాజపా ఓటమి.. అంత ముఖ్యమని, వీలైతే భాజపాను మూడో స్థానంలోకి నెట్టాలన్న నిరణయంతో ఆచి తూచి అడుగేస్తున్నది తెరాస. తమ ప్రత్యర్ధి తెరాసా అనే ప్రచారానికి భాజపా ప్రాముఖ్యతనిస్తున్నది. భాజపాను అడ్డుకునేందుకు అవసరమైతే జానారెడ్డికి అనుకూల వాతావరణం కల్పించే వ్యూహంతో తెరాసా తలమునలై ఉందంటున్నారు.

ఈ పరిస్థితుల్లో అనివార్యమైతే కాంగ్రెస్‌ ‌కు ఒక స్థానం వచ్చినా తమకు నస్టం ఉండదని, కానీ అదే భాజపాకు దక్కితే భవిష్యత్తు తమకు ముళ్ళబాటేనన్న అయోమయం తెరాస నాయకుల్లో ఉందంటున్నారు. ఒక దుబ్బాక గెలిచి, జి హెచ్‌ ఎం ‌సీలో పోటాపోతీగా నిలిచి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వణకు పుట్టించిన భాజపాకు  సాగర్‌ ‌చేజిక్కితే మరింత రెచ్చిపోతుందన్న ఆలోచనతో బిజెపిని మూడో స్థానంలోకి నెట్టేందుకు రహస్యంగా కొందరితో చేతులు కలిపే అవకాశం ఉందంటున్నారు. అభ్యర్ధుల ఉపసమ్హరణ గడువు పూర్తయ్యేనాటికి పరిస్థితి పై పెత్తనం బిగించాలని తెరాసా సమాలోచనలు జరుపుతున్నది. తెరాస అధికారికంగా   దివంగత ఎమ్మెల్యే నరసింహయ్య కుమారుడు భగత్‌ ‌కు అభ్యర్ధిత్వం ప్రకటించి అప్పటి వరకూ ప్రచారాంలో ఉన్న వూహాగానాలకు స్వస్తి పలికింది.

తెలంగాణలో తెదేపా ను మాయం చేయడంలో భాగంగానే తెదేపాతో కాంగ్రెస్‌ ‌పొత్తు కు జానా ముఖ్య బాధ్యత తీసుకుని ఆ పార్ట్టెని మాయం చేసి తెలంగాణలో తానే దీటైన నాయకుడిగా నిరూపించుకుని తెరాసాకు సహాయ పడ్డారని, ప్రతిఫలంగా సాగర్‌ ఉప ఎన్నికలో భాజాపను ఓడించడంలో సహాయపడితే ఆ స్థానం జానారెడ్డికి  కెసీఅర్‌ ‌బహుమతిగా ఇచ్చాననుకునే విధంగా వ్యవహరినచవచ్చునని కూడా కథనాలు వినిపిస్తున్నాయి.    భాజాపాకు అడ్డుకట్టవేయడంలో అవసరమైతే కాంగ్రెస్‌ ‌సహాయం తీసుకోవడంలో కెసీఅర్‌ ‌వెనుకాడరని అంటున్నారు. అయితే భాజాపా సాగర్‌ ‌స్థానానికి అభ్యర్ధి ఎంపికతో ఆ పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమై భాజపా నాయకులు శ్రేణులు, అకస్మాత్తుగా కాషాయ జండా వదలి గులాబి కండువా వేసుకోవడంతో వాతావరణం వేగంగా మారుతున్నది.

కేంద్రంలో కాంగ్రెస్‌ ‌కు, రాష్ట్రంలో తెరాస కి ఉమ్మడి శత్రువైన భాజపాను తెరమరుగు చెయ్యాలంటే ఇక్కడ చేతులు కలపడానికి కాంగ్రెస్‌, ‌తెరాస నాయకులు స్నేహ విధానం అనుసరించవచ్చునని.. అందువలన సాగర్‌ ‌స్థానం లో ఉభయులు అవగాహనతో పనిచేస్తారని వినిపిస్తున్నది. భాజపా అభ్యర్ధి బలహీనత ఒకటి రెండు రోజుల్లో బయటపడితే వ్యూహాలు మారతాయని కూడా ఆశిస్తున్నారు.
– శామ్‌ ‌సుందర్‌

Leave a Reply