టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్నది. ఢిల్లీ వేదికగా రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించు కుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యకమ్రాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నదని బీజేపీ నాయకులు లక్ష్మణ్ అరవింద్‌లు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో రూ. వేల కోట్ల కమీషన్లు కాంట్రాక్టర్ల నుంచి నేరుగా సీఎం కుటుంబానికే అందుతున్నాయని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కమీషన్ల గుట్టు రట్టవుతుందన్న భయంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి అందజేయలేదని విరుచుకుపడ్డారు. బడుగుబలహీనులకు పంపిణీ చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా విమర్శలు చేయడం సమర్థనీయం కాదని, టీఆర్ఎస్ నాయకులు అంతేస్థాయిలో సమాధానం చెప్పారు. ఢిల్లీలో టీఆర్ఎస్ లోకసభపక్షనేత నాయకులు నామానాగేశ్వరరావు, రాజ్యసభపక్షనేత కే.కే. మాట్లాడారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నదని వారు పేర్కొన్నారు.ప్రత్చేకంగా నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు అందిస్తున్న రూ.2016లు వారికి వరప్రసాతమయ్యాయని కే.కే వివరించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమకార్యకమ్రాల్లో చిన్నపాటి అవినీతి కూడా లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని నామానాగేశ్వరరావు తెలిపారు. ప్రతీ కార్యక్రమంలో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి జీరోశాతం కూడా అవినీతి లేకుండా సరిచూసుకొని లబ్దిదారులకు అందిస్తున్నామని టీఆర్ఎస్ నాయకులు వివరించారు. తుక్క్గుగూడా మునిసిపాలీటీ సంఘటనలతో ఈ వివాదాలు తా•స్థాయికి చేరుకున్నాయి.
ఈ మునిసిపాలిటీలో కే.కే ఎక్స్ అఫిసీయో వోటును వినియోగించుకోవడాన్ని బీజేపీ ప్రశ్నించింది. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. ఏపీనుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కే.కే. తన ఎక్స్అఫిసియో వోటును అక్రమంగా వినియోగించుకున్నారని, ఆయనపైచట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఫిర్యాదుచేశారు. ఆయనను రాజ్యసభకు అనర్హునిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. దీనికి తోడు సంక్షేమ కార్యమ్రాల్లో అవినీతి ఉన్నదని బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నది. కే.కే అంశాన్ని తీవ్రంగా తీసుకున్న టీఆర్ఎస్ అంతేస్థాయిలో బీజేపీ పైన విమర్శాస్త్రాలు సంధిస్తున్నది.