Take a fresh look at your lifestyle.

టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ లాలూచీ రాజకీయాలు

TRS and BJP's Lalucci politics revanth reddy

  • అందుకే డబుల్‌ ‌బెడ్రూం ఇళ్లపై సమీక్ష లేదు
  • పట్నం గోస కార్యక్రమంలో ఎంపి రేవంత్‌ ‌రెడ్డి

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని మల్కాజ్‌గిరి ఎంపి ఎ.రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 3 వేల కోట్ల నిధులు వస్తే వాటిని ప్రభుత్వం మిషన్‌ ‌భగీరథకు మళ్లించిందని ఆరోపించారు. బుధవారం పట్నం గోస కార్యక్రమంలో భాగంగా రేవంత్‌ ‌రెడ్డి ఉప్పల్‌ ‌నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పార్టీల మధ్య లాలూచీ ఉండటం వల్లనే హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఈ నిధుల మళ్లింపుపై సమీక్ష నిర్వహించడం లేదని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం లేదనీ, కానీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మాత్రం ప్రత్యేకంగా ఆహ్వానించారని తెలిపారు. ఆ రెండు పార్టీల మధ్య లాలూచీ ఉందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పది ఎకరాల్లో కేసీఆర్‌ ‌ప్రగతి భవన్‌ ‌కట్టుకున్నారనీ, ఆరేళ్లయినా పేదలకు మాత్రం డబుల్‌ ‌బెడ్రూం ఇళ్లు రాలేదని ఆరోపించారు.

సొంత ఇంటి కల నెరవేరక, అద్దె ఇంటి కిరాయిలు కట్టలేక నానా అవస్తలు పడుతున్నట్టు మహిళలు తన వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. డబ్బా ఇల్లు వద్దు డబుల్‌ ‌బెడ్రూం ముద్దు అని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కేసీఆర్‌ ‌తన ఆరేళ్ల పాలనలో కేవలం 3,822 ఇళ్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. పేదలకు డబుల్‌ ‌బెడ్రూం ఇళ్లు అన్నది అందని ద్రాక్షగానే మిగిలిందన్నారు. దీనిపై పార్లమెంటులో మాట్లాడటంతో పాటు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయనున్నట్లు చెప్పారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌, ‌వరంగల్‌, ‌ఖమ్మం మున్సిపల్‌ ‌కార్పొరేషన్లకు జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పట్టణ ప్రగతి పేరుతో కేటీఆర్‌ ‌బయల్దేరారని ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి దుయ్యబట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!