Take a fresh look at your lifestyle.

70 ‌శాతం ధాన్యం ఇంకా రైతుల వద్దే ఉంది.. !

  • కొనుగోళ్ల విషయంలో టీఆర్‌ఎస్‌, ‌బిజేపి రెండు తప్పులు చేసినయి: కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటి రెడ్డి
  • పనికి రాని ప్రాజెక్ట్‌ల మీద టీఆర్‌ఎస్‌ ‌కమిషన్లు దండుకున్నదని ఆరోపణ

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, డిసెంబర్‌ 2: ‌వానాకాలానికి సంబంధించి రైతుల వద్ద ఇంకా 70 శాతం ధాన్యం ఉందని భువనగిరి ఎంపి కోమటి రెడ్డి అన్నరు. తెలంగాణ రైతులు రెండు నెలలుగా ఖరీఫ్‌ ‌పంట ధాన్యం అమ్ముకోలేక నానా తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పంట కొనుగోలు చేయకుండా యాసంగి పంట కోసం పోరాటం చేస్తుందని మండిపడ్డారు. ధాన్యం ప్రొక్యూర్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ ‌మొదటి దోషి అయితే, బీజేపీ రెండో దోషి అన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆర్టీసీ టికెట్‌ ‌ధరలు పెంచడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్‌ ‌డీజిల్‌పై వ్యాట్‌ ‌తగ్గించాలని డిమాండ్‌ ‌చేశారు. టీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌పనికి రాని ప్రాజెక్టులను నిర్మించి కమిషన్‌ ‌తీసుకుంటుందని ఆరోపించారు.

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌ ‌నుంచి భద్రాచలం వరకు ఆమోదం పొందిన నూతన రహదారి నిర్మాణంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీని కలిసినట్లు తెలిపారు. ఈ రహదారిలో 120 కి.మీ భువనగిరి పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలో ఉంటుందని అన్నారు. రెండు రాజధానుల మధ్య ట్రాఫిక్‌ ‌పెరిగిందన్నారు. హైదరాబాద్‌- ‌భద్రాచలం రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం ఆదా అవుతుందన్నారు. త్వరగా టెండర్ల పక్రియ ప్రారంభించాలని కేంద్రమంత్రి అధికారులను ఆదేశించారని తెలిపారు. రెండు నెలల్లో ఈ రహదారి పనులు ప్రారంభమయ్యేలా అధికారులకు అదేశాలిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారన్నారు.

తెలంగాణాలో 4028 మెగావాట్ల సోలార్‌ ‌పవర్‌ ‌కెపాసిటి ఇన్‌స్టాల్‌ ‌చేశామని ఎంపి ప్రశ్నకు కేంద్రం జవాబు
తెలంగాణ రాష్ట్రంలో 4028.01 మెగా వాట్ల సోలార్‌ ‌పవర్‌ ‌కెపాసిటిని ఇనిస్టాల్‌ ‌చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో ఈ ఏడాది మార్చి 31 వరకు 3953.12 మెగావాట్లు, 74.89 మెగావాట్లు కెపాసిటి ఇనిస్టాల్‌ ‌చేసినట్లు తెలిపింది. ఎంపి మన్నెశ్రీనివాస్‌ ‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆర్‌ ‌కె సింగ్‌ ‌రాతపూర్వక సమాధానం ఇచ్చారు. నేషనల్‌ ‌సోలార్‌ ‌మిషన్‌ ‌స్కీమ్‌(ఎన్‌ఎస్‌ఎం) ‌లో భాగంగా దేశంలో సోలార్‌ ‌పవర్‌ ‌కెపాసిటి 46.25 జీడబ్ల్యూ గ్రిడ్‌ ‌కనెక్టెడ్‌ ఇన్‌స్టాల్‌ ‌చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. 40 వేల మెగావాట్ల సోలార్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని 50 సోలార్‌ ‌పార్కులు, అల్ట్రా మెగా సోలార్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్ట్‌ల ఏర్పాటు కోసం ఎన్‌ఎస్‌ఎం అమలు జరుగుతుందని పేర్కొన్నారు.

Leave a Reply