Take a fresh look at your lifestyle.

తెలంగాణకు టీఆర్‌ఎస్‌, ‌బీజేపీలు తీరని ద్రోహం

  • 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఐటీఐఆర్‌ ఏర్పాటులో విఫలం
  • బిజెపి నేతలు డబ్బుల సంచులతో సంచారం
  • మండిపపడ్డ పిసి చీఫ్‌ ఉత్తమ్‌

‌తెలంగాణకు టీఆర్‌ఎస్‌, ‌బీజేపీలు తీరని ద్రోహం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఐటీఐఆర్‌ను టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేయలేకపోతోందని ఆయన విమర్శించారు. తెలంగాణలోని భద్రాచలం రామమందిర్‌ ‌భూముల బీజేపీ ఆంధ్రకు ఇచ్చి అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. బీజేపీ దేశానికి, రాష్ట్రానికి ఏమి చేయకపోగా డబ్బుల సంచులు పట్టుకొని కాంగ్రెస్‌ ‌నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఈ గ్రాడ్యువట్‌ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు గట్టిగా బుద్ది చెప్పాలని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. సామాన్య ప్రజలు వంటగ్యాస్‌ ‌వాడే పరిస్థితి లేకుండా ధరలు పెంచేశారు. బీజేపీ ఘనకార్యం వల్ల ఎల్పీజీ గ్యాస్‌ ‌మూడింతలు పెరిగి 850 రూపాయలు అయింది.

ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ ‌సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు ఈ స్థాయిలో పెంచడం దుర్మార్గమైన చర్య. పక్క రాష్టాల్లో్ర ఎల్పీజీ గ్యాస్‌పై సబ్సిడీ ఇస్తున్నట్లుగా కేసీఆర్‌ ఇక్కడ ఇవ్వడం లేదు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్‌ ‌పార్టీ సామాన్య ప్రజల పక్షాన నిలబడి ధరల పెరుగుదలపై పోరాడుతుందని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. ఇదిలావుంటే కేసీఆర్‌ ‌పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించడం పై నేను రిటన్‌ ‌కంప్లైంట్‌ ఇస్తా, చర్యలు తీసుకునే ధైర్యం బీజేపీకి ఉందా టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ ‌విసిరారు.

నిజానికి సంజయ్‌, ‌కేసీఆర్‌ ‌వేరువేరుగా కనిపించినప్పటికీ ఇద్దరూ ఒక్కటేనని రేవంత్‌ ‌రెడ్డి దుయ్యబట్టారు. ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్‌కు కేసిఆర్‌ ‌హాజరు కాకుండా, హాజరు పట్టికలో కేసీఆర్‌కు బదులు మరోకరితో సంతకాలు చేయించారు. కేసీఆర్‌ ‌పార్లమెంట్‌కు ఎన్నిసార్లు హాజరయ్యారు? సంతకాలు ఏవరివి? బండి సంజయ్‌ ‌ఫోరెన్సిక్‌ ‌టెస్ట్ ‌చేపించగలడా? కేసీఆర్‌ ‌చదువుకుంది బీఏ. కానీ ఎంఏ చదువుకున్నట్లు పార్లమెంట్‌కు సమాచారం ఇచ్చారు. బండి, కారు ఒక్కటే. కేసీఆర్‌ను సంజయ్‌ను వేరు వేరుగా చూడలేమఅని ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

Leave a Reply