- అబద్దాల ప్రచారంలో గోబెల్స్‌ను మించారు
- బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు
- మీడియా సమావేశంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్
మతతత్వాన్ని, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కేంద్ర మంత్రులంతా ప్రశంసించి..ఎన్నికల వేళ ఛార్జీషీట్ అంటూ బీజేపీ కేంద్ర మంత్రి జవడేకర్ అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌కు కేంద్రం ఏం చేసిందో సూటిగా సుత్తి లేకుండా చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఏం చేశామో చెప్పే వోటర్లను వోటు అడుగుతున్నామని బీజేపీకి ఆ దమ్ముందా అని ప్రశ్నించారు. బీజేపీకి అధికారమిస్తే హైదరాబాద్‌ను గుండుగుత్తాగా అమ్మేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేస్తుందని మండిపడ్డారు.
ఆరేండ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి పథంలో నిలిపిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన వి•డియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని హావి•లంటూ బీజేపీ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చాడు. బీజేపీ నేతలు గోబెల్స్ కజిన్స్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం మంత్రులు సైతం అస్యతాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను తీర్చినందుకా టీఆర్ఎస్ ప్రభత్వుంపై చార్జ్‌షీట్ విడుదల చేశారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతుబంధు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇంటింటికి మంచి నీళ్లు, వేలాది గురుకులాలు పెట్టి పేద విద్యార్థులను చదివిస్తున్నందుకే టీఆర్ఎస్పై చార్జ్‌షీట్ విడుదల చేశారా? అని బిజేపీ నేతలను నిలదీశారు. దేశంలో ఎక్కడలేని విదంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయే అన్నారు. తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రమని కేంద్రమంత్రులు చెప్పారని గుర్తుచేశారు. అన్నింటినీ ప్రైవేట్‌పరం చేయడమే బీజేపీ పాలసీ అని విమర్శించారు.