Take a fresh look at your lifestyle.

ట్రబుల్స్‌లో ట్రబుల్‌ ‌షూటర్‌

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా సతీమణిని పోటీ చేయించడంతో…
  • ‌మంత్రి హరీష్‌రావు జగ్గారెడ్డి సెటైర్‌

టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుపై తనదైనశైలిలో సెటైర్లు వేశారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో నా సతీమణి నిర్మలను కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబ్టెడంతో..టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌గా పిలువబడే మంత్రి హరీష్‌రావును ట్రబుల్స్‌లో పడ్డాడనీ జగ్గారెడ్డి వ్యాఖ్యనించారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎక్స్అఫిషియో సభ్యుడుగా వోటు హక్కు వినియోగించుకున్న అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ…స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి కేవలం 230మంది వోట్లు ఉన్నాయనీ తెలిసీ కూడా తన సతీమణి నిర్మలను కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించడంతో అధికార టిఆర్‌ఎస్‌  ‌పార్టీకి గుబులు పట్టుకుందన్నారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి నిలబెట్టకముందు అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఏకగ్రీవం అవుతుందననుకున్నా…ఎమ్మెల్సీని ఏకగ్రీవంగా కాకుండా చేయడంతో మేము తొలి విజయం సాధించినట్లుగా జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి పోటీతో  ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన వోటర్లయినా(ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు) వారందరినీ మంత్రి హరీష్‌రావు సొంత బిడ్డల్లాగా, అల్లుండ్లగా చూసుకున్నారన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ మాదిరిగా కాంగ్రెస్‌ ‌పార్టీ క్యాంపులు పెట్టలేదన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలో ఉండటమే కాకుండా, ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో 777వోట్లు ఉండి కూడా క్యాంపు పెట్టిందంటే కాంగ్రెస్‌ ‌పార్టీ నైతిక విజయం సాధించందన్నారు.

టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఏకగ్రీవం కాకూడదనే కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా నిర్మలను పోటీలోకి దించాననీ, 230వోట్లు ఉన్న కాంగ్రెస్‌కు మరో 170వోట్లు వస్తాయనీ ఆశిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఇక ఏమైనా ఉంటే అది దైవ నిర్ణయమన్నారు. గతంలో  ఉమ్మడి మెదక్‌ ‌జిలాల్లో కాంగ్రెస్‌ ‌పార్టీది పై ‘చెయ్యి’ఉండేదనీ,  తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి 8 స్థానాలు ఉండొచ్చు. కానీ, రాబోవు కాలంలో కాంగ్రెస్‌ ‌పార్టీ 8మంది ఎమ్మెల్యేలు గెలుపొందితే టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమవుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి నిర్మలకు వోట్లేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.

Leave a Reply