Take a fresh look at your lifestyle.

విశాఖలో కొరోనా మృతుల కుటుంబాలకు కష్టాలు

శ్మశానం చేరుకున్న శవాలపై బంధువులకు అందని సమాచారం
‌విశాఖలో కరోనా విలయతాండవం చేస్తోంది. మృతదేహాలు భారీగా జ్ఞానాపురం శ్మశానవాటికకు చేరుకుంటున్నాయి. చాలా మంది బంధువుల సమాచారం అందలేదని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి మృతదేహాల కోసం, శ్మశానంలో బంధువులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా నిబంధనలతో మృతదేహాలు తరిలిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల మృతదేహాల తరలింపులో నిబంధనలు పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సెకండ్‌ ‌వేవ్‌ ‌దెబ్బకు జనాలు బయట అడుగు పెట్టాలంటే భయపడిపోతున్నారు. దీంతో అందరూ అలర్ట్ అవుతున్నారు.. ఇళ్లలోకి ఎవర్నీ రానివ్వడం లేదు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఇంటి బయట ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి తమ ఇంట్లోకి ఎవరూ రావొద్దంటున్నారు.

విశాఖలో ఇదే తరహాలో ప్లెక్సీలు, బోర్డులు కనిపిస్తున్నాయి.భీమునిపట్నం నేరెళ్లవలస కాలనీకి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి తన ఇంటికి ఎవరూ రావొద్దని బ్యానర్‌ ‌కట్టారు. బంధువులు, మిత్రులు, ఎవరు రావొద్దని అందులో రాశారు. ’మనకు మొహమాటం ఉన్నా కరోనాకు లేదు’ అని బ్యానర్‌ ఇం‌టి ముందు పెట్టాడు. లోపలికి ఎవరికీ ప్రవేశం లేదంటున్నారు. మాస్క్ ‌ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఎవర్నీ ఎవరూ ఇళ్లలోకి రానివొద్దు అంటూ హెచ్చరిస్తున్నారు.

Leave a Reply