Take a fresh look at your lifestyle.

విభజన సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ

  • ఏర్పాటు చేస్తూ కేంద్రం ప్రకటన
  • 17న చర్చలకు రావాలని ఇరు రాష్ట్రాలకు ఆహ్వానం

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 12 : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం దృష్టి సారించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోమ్‌ ‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీలో కేంద్రం తరపున హోమ్‌ ‌మంత్రిత్వ శాఖ జాయింట్‌ ‌సెక్రటరీ ఆశిష్‌ ‌కుమార్‌ ‌నేతృత్వం వహించనున్నారు. తెలంగాణ నుంచి రామకృష్ణారావు, ఏపీ నుంచి ఎస్‌ఎస్‌ ‌రావత్‌ ‌సమావేశంలో పాల్గొననున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ప్రతి నెల త్రిసభ్య కమిటీ సమావేశం అవుతుందని కేంద్ర హోమ్‌ ‌శాఖ పేర్కొంది. ఇక కేంద్ర హోమ్‌ ‌శాఖ ఎంజెండాలో ఆంధప్రదేశ్‌ ‌ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఈ మేరకు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఈ నెల 17న చర్చలకు రావాలని రాష్ట్రానికి కేంద్ర హోమ్‌ ‌శాఖ ఆహ్వానం పంపించింది.

కేంద్ర హోమ్‌ ‌శాఖ జాయింట్‌ ‌సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్‌ఎస్‌ ‌రావత్‌, ‌తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉన్నారు. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా సమావేశమై 9 అంశాలపై చర్చ జరుపుతారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఏపీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే.

అయితే త్రిసభ్య కమిటీ ఎజెండాలో 9 అంశాలు…ఏపీ స్టేట్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ ‌విభజన, ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్‌ ‌వినియోగ సమస్యపై పరిష్కారం, పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం, రెండు రాష్ట్రాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు, ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌, ‌టీఎస్‌సీఎస్‌సీఎల్‌ ‌మధ్య నగదు ఖాతాల విభజన, ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జాల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు, ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు ఉన్నాయి.

Leave a Reply