Take a fresh look at your lifestyle.

కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి

Trioti Ekadashi as a festival of eyes
నమో నారసింహ నినాదాలతో మార్మోగిన ధర్మపురి క్షేత్రం

ధర్మపురి : నమో నారసిం హ నినాదాలతో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం మార్మోగింది. సోమవారం ముక్కోటి ఏకాదశి ని పురస్కరించుకుని ప్రాత కాలం నుండే ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 2.30 నిమిషాలకు లక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నరసింహ శ్రీ వెంకటే శ్వర స్వామి వార్ల మూలవిరాట్‌ ‌లకు వేద పండితులు మహా క్షీరాభిషేకం ప్రత్యేక పూజలు, ఉపనిషత్తుల పూర్వక మంత్రా ల అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంగళ వాయిద్యాలతో ఉత్తర ద్వారం వద్ద అప్పటికే సర్వాం గ సుందరంగా అలంకరించిన పుష్ప వేదికపై మువ్వు రు ఉత్సవమూర్తులను ఆలయాల నుండి తీసుకువచ్చి పుష్ప వేదికపై ఆశీనులు గావించారు. అనంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు సహస్రనామాలు నివేదనలు సప్త హారతులు మంత్రపుష్పది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ధర్మపురి శ్రీ మఠాధిపతి సచ్చిదానంద సరస్వతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్‌ ‌లు వారి కరములచే వైకుంఠ ద్వార దర్శనం పూజలు నిర్వహించి ద్వారానికి తెరిచారు అప్పటికే క్యూలైన్‌ ‌లలో వేచి ఉన్న భక్తులు స్వామి వారిని దర్శించుకునీ పునీతులయ్యారు. ఈ సందర్భంగా వేద పండి తులు వైకుంఠ ద్వార మహత్యాన్ని భక్తులకు వివరిస్తూ పూ ర్వం రాక్షసుల బాధలు తాళలేక దేవతలు బ్రహ్మ వద్ద వారి బాధను చెప్పగా శుక్లపక్షం ఏకాదశి ప్రభాతవేళ వైకుంఠ పురానికి ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్న చో బాధలు తొలగిపోతాయని ఏకాదశి రోజున ఉత్తర ద్వా ర దర్శనం గుండా స్వామివారిని ఒక్కక్షణం దర్శించిన కోటి యజ్ఞ ఫలం దక్కుతుందని స్కంద పురాణం ద్వారా బ్రహ్మాండ పురాణాన్ని భక్తులకువివరించారు.ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర సాంఘిక సం క్షేమ శాఖ మంత్రి ఈశ్వర్‌ ‌సతీసమేతంగా హాజరు కాగా ఆలయ కార్యని ర్వహణాధికారి సంకటాల శ్రీనివా స్‌,ఆలయ వేదపండితులు ఘన స్వాగతం పలికారు.

Tags: Trioti Ekadashi, festival of eyes

Leave a Reply