Take a fresh look at your lifestyle.

‘‘అరాచక పాలనకు మరో పేరు తృణమూల్‌ ‌కాంగ్రెస్‌’’

పశ్చిమబెంగాల్‌ ‌లో నందిగ్రామ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి సువేంద్‌ అధికారి చేతిలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధినేత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఓటమి పాలు కావడం,  సువేంద్‌ అధికారి కుటుంబానికి ఆ  రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరంతరం ఎప్పుడు ఏమవుతుందో అనే భయం ఏర్పడింది. ఈ పరిస్థితిని గుర్తించిన కేంద్ర హోంశాఖ సువేంద్‌ అధికారి కుటుంబానికి వీఐపీ భద్రతా, సువేంద్‌ అధికారికి జెడ్‌ ‌కేటగిరీని ఇస్తున్నారంటే  పశ్చిమబెంగాల్‌లో  పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

2014 ‌లోక్‌ ‌సభ సాధారణ ఎన్నికలలో నరేంద్ర మోడీ  నాయకత్వన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రాంతీయ విభేదాలు పెరగడమే కాక, దేశవ్యాప్తంగా మత కల్లోలాలు జరుగుతాయని కాంగ్రెస్‌, ‌దాని మిత్రపక్ష పార్టీలతో పాటు కమ్యూనిస్ట్‌లు, వామపక్షా పార్టీలన్ని  దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. కానీ,  కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి 7 వత్సరాలు  గడచినా  నేటీ  వరకు ఎటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడలేదు. మత కల్లోలాలు లేవు. ఈ విషయన్ని విపక్షాలు జీర్ణించుకోలేక పోతూన్నాయి. దేశంలో మత కల్లోలాలు జరిగితే బిజెపిని ఏదో విధంగా బలహీనపరచవచ్చు అనేది వారి భావన.  మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవకముందే అక్కడ హింస, ఘర్షణలు  జరిగినా, నేటి వరకు కాంగ్రెస్‌ ‌నాయకులు గానీ, దేశంలో ప్రతిపక్ష పార్టీలు గానీ, ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.  వారి లక్ష్యం ఒక్కటే, ఏదో ఒక విధంగా బిజెపిని విమర్శించడం.

2019 లోక్‌ ‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ రాదు, రెండవసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి అధికారంలోకి రావడం కష్టం అని కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలన్ని  దేశ వ్యాప్తంగా ప్రచారం చేసినా,  దేశంలో అభివృద్ధి బిజెపి మాత్రమే సాధ్యమని దేశ ప్రజలకు తెలిసే రెండవ సారి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యాబలంతో బిజెపిని కేంద్రంలో అధికారంలోకి తెచ్చారు. దీంతో విపక్షాల పీఠాలు కదిలి పోయ్యాయి.

మమత బెనర్జీ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవక ముందే బెంగాల్‌ ‌రాష్ట్రంలో బిజెపి నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు అవలంబిస్తున్న ధోరణి పరిశీలిస్తే హిట్లర్‌ ‌లాంటి నియంతృత పాలనకు, అరాచక పాలనకు తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌మారుపేరుగ తయారైంది. బెంగాల్‌ ‌లో బిజెపి శ్రేణులకు భద్రత లేక అను క్షణం భయం భయం… పరిస్థితి దాపురించింది.  బెంగాల్‌ ‌లో ఇంత అరాచక పాలన సాగుతున్నా ప్రజాస్వామ్య పరిరక్షకులు అని గొప్పలు  చెప్పుకునే రాహుల్‌ ‌గాంధీ, అరవింద్‌ ‌కీజ్రివాల్‌, ‌మాయవతి, అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌శరద్‌ ‌పవర్‌, ఒమర్‌ అబ్దులా, మహబూబా ముప్తీ, సోనియా గాంధీ… ఏ ఒక్కరూ  ఏ మాత్రం స్పందిచక పోవడం దురదృష్టకరం,పశ్చిమబెంగాల్‌ ‌లో నందిగ్రామ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి సువేంద్‌ అధికారి చేతిలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధినేత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఓటమి పాలు కావడం,  సువేంద్‌ అధికారి కుటుంబానికి ఆ  రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరంతరం ఎప్పుడు ఏమవుతుందో అనే భయం ఏర్పడింది. ఈ పరిస్థితిని గుర్తించిన కేంద్ర హోంశాఖ సువేంద్‌ అధికారి కుటుంబానికి వీఐపీ భద్రతా, సువేంద్‌ అధికారికి జెడ్‌ ‌కేటగిరీని ఇస్తున్నారంటే  పశ్చిమబెంగాల్‌లో  పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్‌  ‌లో  యంఎల్‌ఏ, ‌యంపీలకే  సరైన భద్రత లేనప్పుడు సాధారణ వ్యక్తి పరిస్థితి ఏమిటనేది ఊహించడం చాలా కష్టం.

అలాగే నందిగ్రామ్‌ అసెంబ్లీ నియోజకవర్గం తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన సల్తోరా నియోజకవర్గం.  నిరంతర కూలీ పనులకు వెళ్లే  ఒక సాధారణ మహిళ చందన బౌరి కి బిజెపి పార్టీ టికెట్‌  ‌ప్రకటించగా, ఆమె ఘన విజయం సాధించడం  తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ జీర్ణించుకోలేక పోతున్నది.  నియోజకవర్గంలో బిజెపి పార్టీ కేవలం ఒక సాధారణ మహిళను గెలిపించడమే కాకుండా, ముఖ్యమంత్రి అభ్యర్ధినిని కూడా ఓడించే సత్తాలో ఉందని మరోసారి నిరూపించింది.పశ్చిమబెంగాల్‌  ఎన్నికలలో బిజెపి 3 స్థానాల నుండి 77 స్థానాలకు  బలాన్ని  పెంచుకున్నది.  ఇక్కడ పార్టీ  బలాన్ని  పెంచుకోవడమే కాక చరిత్రలో  లేని విధంగా ఓటింగ్‌ ‌శాతాన్ని సంపాదించింది.  ఈ విషయన్ని దేశంలోని ఇతర ప్రతిపక్ష పార్టీలు, గుర్తించక, లోతుగా అధ్యయనం చేయకుండా,  దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హవా తగ్గి పోయిందని విమర్శలు చేయడం,  రోజు రోజుకు  పట్టు కోల్పోతున్నదని విమర్శలు చేయడం, రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేనితనమనే  ప్రజలకు తెలుసు.  ఐనప్పటికీ  ఆ పార్టీలకు ఇంకా  బుద్ది రాలేదు.

యాస్‌ ‌తుఫాను కారణంగా పశ్చిమబెంగాల్‌   ‌రాష్ట్రం ఎంతో నష్ట పోయిందని తెలుసుకుని, నరేంద్ర మోడీ ప్రభుత్వం వరద సాయం అందించే  ప్రయత్నం చేస్తుంటే మమత బెనర్జీ  ఇతర అధికారులు  ఆ సమావేశానికి హాజరు కాలేదంటే మమత బెనర్జీ కి నిజంగా రాష్ట్రం అభివృద్ధి మీద ద్యాస లేదు అని  అర్థం అవుతున్నది.  అలాంటప్పుడు కేంద్ర  ఎలా ఆ రాష్ట్రానికి వరద సాయం అందిస్తుంది.  ఈ పరిణామాల  ఆలోచించకుండా బిజెపి బెంగాల్‌ ‌రాష్ట్రానికి వరద సాయం చేయలేదని విమర్శిస్తే సహించేది లేదు.మమత బెనర్జీ కేవలం  రాజకీయ ఎదుగుదల మాత్రమే కోరుకుంటుంది తప్ప  పశ్చిమ బెంగాల్‌  అభివృద్ధి ఏ  మాత్రం కాదు అనేది ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం.
             – బండేష్‌ ‌వాల్కందిని, బిజెపి నాయకులు, రాయచూర్‌,(‌కర్నాటక )

Leave a Reply