Take a fresh look at your lifestyle.

సడలని సంకల్పానికి ప్రతీక స్వామి అగ్నివేష్

స్వామి అగ్నివేష్
సన్యాసం స్వీకరించిన
సమస్యలపై రాజీపడని
సడలని ఉక్కు సంకల్పానికి ప్రతీక
అవినీతి చీడను అమాయకులపై పీడనను ఎదిరించి
హక్కుల గొంతుకై నినదించిన ఆవేశం.
వెట్టిచాకిరి విముక్తి కై ఫ్రంట్ కట్టి
శ్రమ జీవుల తట్టిలేపిన తపస్వీ
అరువైయేండ్ల తండ్లాట లో
గోసపడ్డ జనం ఘోషకు చలించి తెలంగాణరాష్ట్రసాధనకు
  ఆసరైన అగ్నికణం స్వామి అగ్నివేష్
అన్నలతో చర్చలకు ఆహ్వానించబడిన పెద్దరికం
కాషాయం కలరు కే కొత్త భాష్యం చెప్పిన
సరికొత్త వ్యక్తిత్వం
ఆశ్రమాల పేరుతో ఆస్తులు పోగేసుకొనే
అక్రమాల స్వాములకు అంకుశం అగ్నివేష్
తెలుగు నేలలోజనించి దేశమంతా తిరిగి
సామాన్యుల పక్షాన నిలబడి కలబడిన నిఖార్సైన కర్మయోగి
స్వామి అగ్నివేష్.
 
గన్ రెడ్డి ఆదిరెడ్డి
9494789731
(స్వామి అగ్నివేష్ మరణానికి నివాళిగా)

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply