మిలియన మార్చ్ జరిగి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా తెలంగాణ అమరవీరులకు గన్ పార్క్ వద్ద టీజేఎస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీజేఎస్ నేత నర్సయ్య మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు.
అనేకమంది బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. కేసీఆర్ దీక్ష దివస్ తప్ప.. సాగర హారం, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలను నిర్వహించడం లేదన్నారు. మిలియన్ మార్చ్ పోరాట స్పూర్తిని కొనసాగిస్తామని నర్సయ్య వెల్లడించారు.