Take a fresh look at your lifestyle.

గోటి తలంబ్రాలు వలుస్తున్న ఆదివాసీలు

మండలంలోని తేగడ గ్రామంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి కోటి తలంబ్రాలను ఆదివాసీలు గోటితో వలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే కొత్తగట్ల గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణానికి కావలసిన తలంబ్రాలను గత నెల రోజులుగా నియమనిష్టలతో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు వలుస్తున్నారు.

ఈ సందర్భంగా ఆ గ్రామ మహిళలు మాట్లాడుతూ మార్చి 11న జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవానికి కోటి తలంబ్రాలను అందజేయాలనే ఉద్దేశంతో గోటితో కోటి వడ్లను వలసి ఆలయ నిర్వాహక అర్చకులు అయిన ఎలమందల శ్రావణ్‌ ‌కుమార్‌, ఎలమందల భాను ప్రకాష్‌ ‌లకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిడియం నాగేశ్వరరావు, ఇర్పా సుబ్బయ్య, మహిళలు కనకమ్మ, అలవాల లక్ష్మి, పొడియం సుజాత, భారతి, గట్టుపల్లి స్వరూప, మిడియం జయమ్మ, భద్రమ్మ, మడకం ముత్యాలక్క తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply