భారతదేశ చరిత్ర సంస్కృతి ఒక వైపు,, గిరిజనుల చరిత్ర, సంస్కృతి,సంప్రదాయాలు ఒక వైపు ప్రదానంగా లంబాడీ తెగ గిరిజనుల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడిన అంశం లంబాడీ పూర్వికులు ఒక మహోన్నత ఆలోచన తో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు. లంబాడీలది ప్రాచీన సంస్కృతి,, అడవులలో పశువుల పోషణ వీరి జీవన ఆధారం. తండా ప్రజలు ఒక ప్రత్యేక గౌరవాన్ని, నాయకత్వం, పంచాయతీ వ్యవస్థ, ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు, పండుగలను కలిగి ఉన్నారు. లంబాడి తెగ పవిత్రమైన ఆచారాలను కలిగి ఉంటారు… లంబాడీలు సంతలో కానీ బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తారు. దీనికి ఒక చరిత్ర ఉంది, లంబాడీలు తెలంగాణ ప్రాంతం నుండి గోదావరి నది దాటి ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు పశువులను తీసుకొని వెళ్లే వారు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళినవారు అందరు తిరిగి వచ్చేవారు కాదు కొంతమంది చనిపోయే వారు వారిని తలుచుకొని వారు ఏడుస్తారు…
ఈ దృశ్యం కంట కన్నీళ్లు పెట్టిస్తుంది. లంబాడి తెగ ప్రజల నుండి బయట సమాజం చాలా నేర్చుకోవాలి. పూర్వం తండాలో లంబాడీ లు నైతికవిలువలు, మానవీయ విలువలు పాటించి వారి సంస్కృతి ని పరిరక్షించుకున్నారు… కానీ ఈ గిరిజన ప్రజల గురించి ఏ మత గ్రంధాలు, ఏ చరిత్ర కారులు, ఏ పుస్తకాలలో రాయలేదు ఏ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం….గిరిజనులు ఈ నాగరిక సమాజంలో పూర్వం నుండి మోసపోతూనె ఉన్నారు. గిరిజనులలో మూఢనమ్మకాలు ఎక్కువ లంబాడిలు శారీరకంగా భారీ మనుసులు.. దృడమైన శరీరం కలిగి ఎత్తుగా ఉంటారు, వారిని చుసిన బ్రిటిష్ ప్రభుత్వం ‘‘ long bodies • ‘‘ అని పేరు పెటింది. దీని నుండి లంబాడి అనే పేరు వచ్చింది.
ఒకే రాష్ట్రంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆంధ్ర ప్రాంతం సుగాలీలు( లంబాడీలు) గిరిజనులను తెలంగాణ ప్రాంత లంబాడీలు డి నోటిఫైడ్ ట్రైభ్స్ ((DNT) గా వెనుకబడిన 20 సంవత్సరాలు వివక్షకు గురయ్యారు. ఈ వివక్షను తొలగించి తెలంగాణలోని లంబాడీలకు న్యాయం చేయించడానికి జాతి నాయకులు బాదావత్ రమణి భాయి, రవీంద్ర నాయక్, వాగ్యా నాయక్ ,స్వామి నాయక్ రిజర్వేషన్లు సాధించేందుకు తెలంగాణలో ఉద్యమాలు నిర్వహించారు. ఆ ఉద్యమాల ఫలితంగా భారత దేశంలోని అనేక రాష్ట్రాల నుండి కొన్ని కులాలు ,జాతులు ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చాలని కోందరు, తీసివేయాలని ఉన్న విజ్ఞప్తులను పరిశీలించడానికి 33 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన కమిటీని నియమించడం జరిగింది. స్వాతంత్రం రాక ముందు నుండి హైదరాబాద్ సంస్థానం లో కూడా గిరిజనులు గానే గుర్తించ బడిన తెలంగాణ ప్రాంత లంబాడీలను 1952 లో నాటి ప్రభుత్వాల తప్పిదాల వల్ల జరిగిన వివక్షను కేంద్ర ప్రభుత్వం 1976 లో సవరించేవరకు లంబాడీ గిరిజనులను (DNT) కోటాలో ఉంచి కొంత న్యాయం చేయడానికి ప్రయత్నించింది. 1956 కంటె ముందు తెలంగాణలో లంబాడాలు బిసీబిఏ జాబితాలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీల జనాభా కేవలం ఆరు శాతమే. ఏపీలో సుగాలీల పేరుతో లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారు.
అదే తెలంగాణలో లంబాడీలు బీసి.ఏ, లో ఉండడం సరైంది కాదని ఎస్టీలో చేరుస్తూ ఇందిరాగాంధీ ఆనాడు సాహాసోపితమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు 4 శాతంఉన్న రిజర్వేషన్లకు అదనంగా మరో 2శాతం కలిపి 6 శాతం ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పడ్డ తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ద్వారా పదిశాతంగా ఉన్న లంబాడీల జనాభాదృష్టిలో పెట్టుకొని ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేసి, ఇక్కడి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించుకునే వెసులుబాటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండేలా చట్టం చేయాలని ప్రధాని మోడీని తెలంగాణ ముఖ్యమంత్రి అనేక సార్లు కల్సి నప్పటికీ, రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించవద్దనే సుప్రీంకోర్టు తీర్పు ఆదారంగా కేంద్రం మొండి చెయ్యి చూపడం వల్లనే రిజర్వేషన్ల అమలుకు అడ్డంకిగా మారింది. 2014 ఎన్నికల ప్రచారంలో తండాలను పంచాయతీలుగా చేస్తానని, గుర్తుంచుకొని నూతన పంచాయతీరాజ్ చట్టం-2018 ఆమోదించి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని కేసీఆర్ నిబద్ధతను చాటారు. దేశంలో ఎక్కడ లేని విదంగా తండాలు కొత్త పంచాయతీలుగా ఎర్పడి, తమ పల్లెలను ఇక తామే పరిపాలించుకునే అవకాశం దక్కడం, ప్రగతి పంచా యితీలుగా అవిష్కరించడం ముధావహాం.
తెలంగాణలోని ప్రతి గిరిజన తండా తీజ్ పండుగ తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయంగా లంబాడీలు ఘనంగా జరుపుతారు. ఈ పండుగ బతుకమ్మను పోలి ఉంటుంది. తీజ్ను ఎనిమిది రోజుల పాటు పూజించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాలను తండాలోని పెళ్ళికాని ఆడపిల్లలే నిర్వహిస్తారు. వీరికి తండాపెద్దలు, సోదరులు సహకరిస్తారు. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్’ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా ‘తీజ్’గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే.. తీజ్లో గోధుమ మొలకలను పూజించడం లంబాడీల ఆనవాయితీ. కొత్త పేర్లు కొత్త రూపాల్లో పండుగలు తండాలలోకి ప్రవేశిస్తున్నాయి. ఆర్థికంగా సామాజికంగా వీరిని మరింత ఇబ్బందుల్లో పడేసే విధంగా మూఢనమ్మకాలను నమ్మిస్తున్నారు. ఇదంతా వారి జీవన విధానాన్ని సహజీవనాన్ని ధ్వసం చేయడమే గతంలో తండా పెద్దలు కూర్చొని ఏ కార్యం అయినా పండుగ అయినా పెళ్ళి అయినా పంచాయితీ అయినా సామూహికంగా పరిష్కరించుకునేది. కార్యం పూర్తి చేసేది.
ఇప్పుడు అది లేకుండా పోయింది. ఇప్పుడు బ్రాహ్మణీయ, పాశ్చాత్య సంస్కృతులు తండామీద పడి వారి జీవన విధానం ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయిన లంబాడీలు తండాలలో తమ ఆచార వ్యవహారాలను పాటిస్తూనే ఉన్నారు. తండా నాయక్ (తండా పెద్ద ) ఏం చెప్తే అదే లంబాడీ గిరిజన ప్రజలకు వేదం. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో సంస్కృతి, బాషా కనుమరుగవుతున్నా ఈ కాలంలో సంసృతి సంప్రదాయాలను రక్షించడం అందరు బాధ్యతగా గుర్తురెగినప్పుడే సేవాలాల్ మహారాజ్ బోధనలకు సార్థకం దక్కుతుందనేది నిర్వీవాదాంశం.
– డా.సంగని మల్లేశ్వర్,విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాయం, వరంగల్,సెల్- 9866255355