Take a fresh look at your lifestyle.

గిరిజన ఆశ్రమపాఠశాలల్లో.. టెన్త్ ‌విద్యార్థులకు ప్రత్యేకశిక్షణ

Tribal ashram schools specializing in Tenth students

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటెన్స్‌వ్‌ ‌స్టడీ కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఎక్కువ శాతం ఫలితాలను సాధించడమే కాకుండా, ఎక్కువ ర్యాంకులు కూడా సాథిం చాలనే లక్ష్యంతో గిరిజనసంక్షేమ పాఠశాలల్లో కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులకు వర్తించే విధంగా ఉండే ఒక పాఠశాలకు టెన్స్ ‌విద్యార్థులను తరలించారు. 102 సంక్షేమ పాఠశాలకోసం ఈ ఏర్పాట్లు చేశారు. 100 మంది విద్యార్థులకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ విద్యార్థులందరికీ చాలా సౌకర్యంగా ఉండేవిధంగా పెద్ద పెద్దహాలు ఉన్న పాఠశాలను ఎంచుకొని విద్యార్థులందరికీ ప్రత్యేక కోచింగ్‌ ఇస్తున్నారు. మాథ్స్, ‌సైన్స్‌తో పాటు ఇతర సబ్జెక్ట్‌లపైన విశేష అనుభవం ఉపాధ్యాయులను ప్రత్యేక కోచింగ్‌ ‌సెంటర్‌కు డిప్యూటేషన్‌ ‌పద్ధతిలో బదిలీ చేశారు.ఇదివరలో కన్నా 2018 – 19 మార్చి విద్యాసంవ్సరంలో 18.98 అధికంగాఉత్తీర్ణతా పెరిగింది. ఈ ఫలితాలను అంచనా వేసిన గిరిజనసంక్షేమశాఖ కమిషనర్‌ ‌క్రిష్టినా జడ్‌.‌చొంగ్తు ఈ ప్రత్యేక కోచింగ్‌ ‌విధానానికి రూపకల్పన చేశారు. ప్రతీరోజూ రేమిడియల్‌ ‌తరగతులు, రివిజన్‌ ‌క్లాసెస్‌తోపాటు ప్రతీరోజూ పరీక్షలు పెడుతున్నారు. పరీక్షలను బోర్డు పరీక్షా పద్దతిలో నిర్వహిస్తున్నారు. అదేరోజూ మూల్యాంకనం చేసి ఫలితాలను సరిచూస్తున్నారు. వ్యాస రూపప్రశ్నలను సులభంగా రాసేందుకు వీలుగా ఆ అంశాలన్నీ కలిసివచ్చే విధంగా క్విజ్‌పోటీలు నిర్వహిస్తున్నారు.

ప్రతీరోజు రూ.245 విలువగల అదనపు స్టడీమెటీరియల్‌, ఐదునోట్‌బుక్స్ అదనంగా పౌష్ఠికాహారం ఇస్తున్నామని గిరిజనసంక్షేమశాఖ కమిషనర్‌ ‌క్రిష్టియాన్‌ ‌జడ్‌.‌చొంగ్తు పేర్కొన్నారు.కెరీర్‌గైడెన్స్, ‌మోటివేషన్‌లపై తరగతులు చెప్తున్నారు.విద్యార్థులు పాఠాలను కంప్యూటర్లలో వినేవిధంగా, చాలాసార్లు చదువుకునేవిధంగా కంప్యూటర్లను సిద్ధం చేశారు. నూరుశాతం ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో జిల్లా స్థాయి అధికారులు వారానికి రెండుసార్లు, రాష్ట్ర స్థాయి అధికారులు వారానికి ఒకసారి పర్యవేక్షణలను చేయాలని నిర్ణయించారు.

Leave a Reply