Take a fresh look at your lifestyle.

నాటిన ప్రతి మొక్కకు ట్రీ గాడ్‌ ఏర్పాటు చేయాలి

మహబూబ్‌నగర్‌, ‌జూన్‌ 12 (‌ప్రజాతంత్ర ప్రతినిధి) : హరిత హారం కింద నాటిన అన్ని మొక్కలకు ట్రీ గా ర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ‌వెంకట రావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం  కోయిల్‌ ‌కొండ మండలం వెంకటాపూర్‌, ‌కోయిలకొండ, పారుపల్లి గ్రామాలలో పర్యటించారు. వెంకటాపూర్‌ ‌గ్రామంలో హరితహారం నర్సరీని, వైకుంఠ దామాన్ని, పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నది లేనిది సైతం ఆయన పరిశీలించారు .ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ హరితహారం మొక్కలన్నింటికీ తప్పనిసరిగా ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ ‌కోయిల్కొండ మండలం లోని పారుపల్లి గ్రామంలో తెలంగాణకు హరితహారం నర్సరీని సందర్శించారు. నర్సరీ నిర్వహణ బాగుండటం, అంతేకాక మొక్కలు కూడా బాగా ఉండడంతో నర్సరీ నిర్వాహకులను ఆయన అభినందించారు. అయితే నర్సరీ  చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.  కలెక్టర్‌ ‌వెంట కోయిలకొండ ఎంపీడీవో, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.కోయిలకొండ నుండి మహబూబ్‌ ‌నగర్‌ ‌తిరుగుప్రయాణంలో భవాని సాగర్‌ ‌చెక్‌ ‌డ్యామ్‌ ‌పరిసరాలను జిల్లా కలెక్టర్‌ ‌పరిశీలించారు. భవాని సాగర్‌ ‌చెక్‌ ‌డ్యామ్‌ ‌పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయని,భవాని సాగర్‌ ‌ను పిక్నిక్‌ ‌స్పాట్గా తీర్చిదిద్దేందుకు మంచి అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

ఉపాధి హామీ పనుల పై కలెక్టర్‌ ‌సమీక్ష
వివిధ శాఖల ద్వారా ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టేందుకు గల అవకాశాలను పరిశీలించా లని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.‌వెంకటరావు అన్నారు. శుక్ర వారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీపథకంపై ముఖ్యమైన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఉపాధిహామీ పథకం కిం ద  ఆయా శాఖల సమ్మిళితం తో  చేపట్టే పనులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని ఆయన సూచించారు. గ్రామ పంచాయతీల లో  కంప చెట్లు తొలగింపు, పరిశుభ్రత, ఇరిగేషన్‌ ‌కేనాల్స్‌లో పూడికతీత తొలగింపు, కంధకాల తవ్వకం, ఊట కుంట ల నిర్మాణం,చెక్‌ ‌డ్యాముల నిర్మాణం, వ్యవసాయ శాఖ ద్వారా నాట్లు వేయడం , పైరుపై పిచికారి చేయడం, అంతేకాక ఉద్యాన,మత్స్య  శాఖల ద్వారా, గృహ నిర్మా ణశాఖ ద్వారా రహదారులు ,మురికి కాల్వల నిర్మాణం  వంటి వాటి ద్వారా ఉపాధి హామీ కూలీలకు  వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించే విషయమై ఒక కార్యాచర ణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని ఆయన ఆదేశించారు  ఈ సమావేశానికి  అదనపుకలెక్టర్‌ ‌మోహన్‌లాల్‌, ‌డిఆర్‌డిఓ వెంకట్‌ ‌రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి గంగారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ‌రూఖ్య నాయక్‌,  ‌నీటిపారుదల శాఖ, ఈ ఈ పంచాయతీ రాజ్‌ ఈ ఈ ‌నరేందర్‌ ‌రెడ్డి  ,తదితరులు ఉన్నారు.

Leave a Reply