అటవీ భూముల విధ్వంసంపై సమగ్ర సమాచారం పర్యావరణ వేత్తల వద్ద ఉంది. ఐఎస్ఎఫ్ఆర్ విడుదల చేసే నివేదికలు తప్పుల తడకలు. వన్యమృగ సంరక్షణ ఉద్యమ నాయకుడు ఎండి మధుసూదన్ ఈ నివేదిక ఎక్కువ తికమక పెడుతోందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నివేదికలో 30 శాతం అటవీ ప్రాంతం అంటే 2,15,000 చదరపు కిలోమీటర్ల గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. ఆ సమాచారం ఎంతో విలువైనది. దానిని ఈ నివేదికలో చేర్చి ఉంటే విలువైన అటవీ భూములను ఏ విధంగా కోల్పోతున్నామో స్పష్టం అవుతుందని ఆయన అన్నారు. అడవుల విస్తీర్ణత పెరుగుతోందన్న మాట కూడా వాస్తవం కాదు.

గడిచిన సంవత్సరంలో దేశంలో అడవుల తీరుతెన్నులపై ప్రభుత్వం ఎప్పటి మాదిరిగానే వాస్తవాలను కప్పిపుచ్చి 2019 వార్షిక నివేదికలో రంగుల చిత్రాన్ని చూపింది. రెండేళ్ళ కోసారి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్టు రిపోర్టు(ఐఎస్ఎఫ్ఆర్)ని ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. తాను సాధించినవన్నీ విజయాలని ఆ నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. అటవీ ప్రాంతం విస్తరణ 5,188 కిలో మీటర్లు పెరిగినట్టు గొప్పలు చెప్పుకుంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విజయం సామాన్యమైనది కాదనీ, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణలో అనేక దేశాలు వెనకబడి ఉన్న తరుణంలో భారత్ ఘనవిజయాన్ని సాధించిందని వ్యాఖ్యానించారు. అడవుల సంరక్షణలో భారత్ అన్ని దేశాలకూ నేతృత్వం వహిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం మామూలు ధోరణిలోనే తన విజయాలను గురించి ఈ నివేదికలో పూసగుచ్చినట్టు వివరించింది. అటవీ శాఖ వాస్తవాలను కప్పిపుచ్చుతోందనడానికి నాలుగు ప్రధానాంశాలు ఉన్నాయి.
మరుగున వాస్తవ గణాంకాలు
ఐఎస్ఎఫ్ఆర్ దేశంలో అటవీ ప్రాంతాన్ని కొలిచి ఎప్పటికప్పుడు వివరాలను విడుదల చేస్తుంది. ఎంతో కొంత పురోగతిని చూపిస్తూ ఉంటుంది. ప్రభుత్వం సంతృప్తిని ప్రకటిస్తుంటుంది. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఈ గణాంకాల్లో అడవుల తరగుదల గురించి ఆసక్తి ఉన్న వారు నిశితంగా పరిశీలన జరుపుతారు. అంటే, చెట్లు నరికివేత గురించిన సమగ్ర సమాచారం ఈ నివేదికలో అధికారులు పొందుపర్చడం లేదన్న మాట. అటవీ భూములను ఇతర ప్రయోజనాలకు వినియోగించేందుకు అనుమతులు ఈ మధ్య కాలంలో పెరిగాయి. ఉదాహరణకు 2017-18లో 49,583 హెక్టార్ల అటవీ భూమిని ఇతర ప్రయోజనలకు మళ్ళింపునకు అనుమతి ఇచ్చారు. పరిశ్రమల కోసం ఈ భూమిని కేటాయించారు. గనుల తవ్వకానికీ, ఆనకట్టల నిర్మాణానికి, రేవులకు రోడ్ల నిర్మాణానికీ, ఇతర మౌలిక సదుపాయాల కోసం కేటాయించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండింటి పాత్ర ఉంది.
ఒడిషాలో తాలిబిరా బొగ్గు గనుల విస్తరణ కోసం 1, 30,000 చెట్లను నరికివేసేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, వీటి ప్రభావం స్వల్పమని ప్రభుత్వం పేర్కొంటుంది. పరిశ్రమల కోసం కార్పొరేట్, పెద్ద పారిశ్రామిక సంస్థలకు వేలాది ఎకరాల అటవీ భూములను ధారాదత్తం చేస్తూ అడవులపై ఆధారపడి జీవించే నిరుపేదలను నిరాధారం చేస్తున్నారు. అటవీ భూముల విధ్వంసంపై సమగ్ర సమాచారం పర్యావరణ వేత్తల వద్ద ఉంది. ఐఎస్ఎఫ్ఆర్ విడుదల చేసే నివేదికలు తప్పుల తడకలు. వన్యమృగ సంరక్షణ ఉద్యమ నాయకుడు ఎండి మధుసూదన్ ఈ నివేదిక ఎక్కువ తికమక పెడుతోందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నివేదికలో 30 శాతం అటవీ ప్రాంతం అంటే 2,15,000 చదరపు కిలోమీటర్ల గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. ఆ సమాచారం ఎంతో విలువైనది. దానిని ఈ నివేదికలో చేర్చి ఉంటే విలువైన అటవీ భూములను ఏ విధంగా కోల్పోతున్నామో స్పష్టం అవుతుందని ఆయన అన్నారు. అడవుల విస్తీర్ణత పెరుగుతోందన్న మాట కూడా వాస్తవం కాదు. ఎందుకంటే మహారాష్ట్రలో అటవీ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పిన దాన్ని రిజర్వు అటవీ భూములను పెరిగిన అడవుల విస్తీర్ణంలో చేర్చారు. అంటే, అవి కొత్తగా ఏర్పడిన అడవులు కాదు. ఇవి రెవిన్యూ భూములు. వ్యవసాయానికీ, పశువుల మేపు కోవడానికి రిజర్వు చేయబడినవి. ఐఎఫ్ఎస్ఆర్ విడుదల చేసే గణాంకాలలో స్పష్టత లేకపోగా, మరింత గందరగోళ పరుస్తున్నాయి.
గ్రీన్ వాషింగ్:
ఐఎఫ్ఎస్ఆర్ అటవీ భూముల కొలతకు అనుసరించే పద్దతిని ఆ సంస్థ కార్యకలాపాలను దగ్గరనుంచి పరిశీలించే విమర్శకుడు ఒకరు తెలిపారు. కనిపించేదంతా బంగారం అన్న సూత్రాన్ని పాటించినట్టుగా పచ్చగా కనిపించేవన్నీ అడవులని ఈ సంస్థ అధికారులు లెక్కలు చెబుతుంటారని ఆయన అన్నారు. సహజమైన అడవులకూ, వాణిజ్య పరమైన మొక్కలు నాటే కార్యక్రమాలకూ తేడా లేకుండా ఈ సంస్థ అధికారులు నివేదికలు తయారు చేస్తుంటారు. 2012లో ఎం రాజశేఖర్ పంపిన వార్తా కథనంలో మొక్కలు నాటే కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో భూసార పరిస్థితిని, భూమిలో తేమను పరిగణనలోకి తీసుకోకుండా సాగుతున్నాయని నిపుణులను ఉటంకిస్తూ పేర్కొన్నారు. దీని వల్ల నాటిన మొక్కలన్నీ బతికినట్టు లెక్కలు చూపే అవకాశం ఉందని ఆయన అన్నారు. అందువల్ల అటవీ విస్తరణ గురించి వాస్తవ గణాంకాలు తెలియడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అడవుల నిర్వహణ వల్ల ప్రభుత్వం కోరిన విధంగా అధికారులు నివేదికలు తయారు చేస్తుంటారు. విలేఖరులు ఆయా ప్రాంతాలు సందర్సించిన సందర్భంలో ప్రశ్నలు అడిగినప్పుడు వాస్తవాలు వెలుగు చూస్తుంటాయని రాజశేఖర్ అన్నారు. అడవులకు ఎవరు నష్టం కలిగించారన్నది తేల్చడం కష్టంగా ఉంది. 1970వ, 1980వ దశకాల్లో అడవుల్లో జీవనం సాగించే నిరుపేదలు పొట్ట కూటి కోసం చెట్లను నరికేవారని చెప్పేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మైదాన ప్రాంతాల నుంచి వొచ్చిన వారు అటవీ సిబ్బందిని మచ్చిక చేసుకుని చెట్లు నరికేస్తున్నారు. ఈ విషయాన్ని ఆదివాసీ నాయకులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. అడవులపై ప్రభుత్వ విధానం ఏమిటో ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు. జార్ఖండ్లో ఇటీవల బీజేపీ ఓటమికి కారణం ఆదివాసుల ఆగ్రహమే. ఆదివాసులకు ప్రమేయం లేకుండా అడవుల కేటాయింపు జరగుతోంది. ఆదివాసులకు అడవులపై చట్టపరమైన హక్కులు కల్పిస్తామని కల్పించలేదు. దాంతో వారు ఆగ్రహించారు. చెట్ల గణాంకాలను సేకరించడం కాకుల లెక్కల మాదిరిగా తయారవుతోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో చెట్ల పరిరక్షణ సక్రమంగా సాగడం లేదు. నగరాల విస్తరణ కోసం రోడ్ల కోసం చెట్లను నరికి వేస్తున్నారు. అడవుల సంరక్షణపై ఇటీవల మాడ్రిడ్లో 25వ అంతర్జాతీయ మహాసభ జరిగింది. ఎప్పటి మాదిరిగానే తీర్మానాలు, ప్రసంగాలు జరిగాయి. నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించలేదు. భూతాపం నిధులను అటవీ సంరక్షణకు వినియోగించాలి. కానీ, అలా జరుగుతోందా అంటే ప్రశ్నార్థకమే!
– ‘ద వైర్’ సౌజన్యంతో..
Tags: isfr, the wire, green washing, orissa coal, madrid