Take a fresh look at your lifestyle.

‌క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక వ్యవస్థలకు ముప్పు

స్పష్టం చేసిన ఆర్‌బీఐ గవర్నర్‌
క్రిప్టోకరెన్సీలతో ఆర్థిక వ్యవస్థలకు ముప్పని ఆర్‌బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత దాస్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు. క్రిప్టోకరెన్సీలకు నియంత్రిత వ్యవస్థ ఏర్పాటు చేసే వరకూ ఇవి దేశ ఆర్థిక స్థిరత్వానికి సవాల్‌ ‌విసురుతాయని వ్యాఖ్యానించారు. భారత్‌లో క్రిప్టోకరెన్సీ మదుపుదారుల సంఖ్య..మార్కెట్‌ ‌విలువపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.

వర్చువల్‌ ‌కరెన్సీలపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని అయితే కేంద్ర బ్యాంకర్‌గా క్రిప్టోకరెన్సీలపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్‌బీఐ గవర్నర్‌ ‌పేర్కొన్నారు. భారత్‌లో 10 కోట్ల మంది క్రిప్టో కరెన్సీ కలిగి ఉన్నారని ఇటీవల ఓ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్ల సంఖ్యపైనా శక్తికాంతదాస్‌ ‌సందేహం వ్యక్తం చేయడం గమనార్హం.

Leave a Reply