Take a fresh look at your lifestyle.

రవాణ సేవలు ఇక మరింత పారదర్శకం: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

E-bidding along with variety,Transportation, services are more, transparent Minister, Puvvada Ajaykumar
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

రవాణా శాఖలో నిర్వహిస్తున్న 59 రకాల పౌర సేవలను మరింత పారదర్శకం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌తెలిపారు. హైద్రాబాద్‌లోని తన కార్యాలయంలో స్పెషల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌నెంబర్‌ ‌రిజర్వేషన్‌కోసం ఇ-బిడ్డింగ్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రవాణా శాఖలో ఆటోమేటిక్‌ ఆన్‌లైన్‌ ‌సేవలు అమలు చేస్తుందన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్‌ ‌ఫీజులతో పాటు బిడ్‌ ‌మొత్తానికి డిడి తీసుకుని స్పెషల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌నంబర్‌ ‌రిజర్వేషన్‌ ‌మాన్యువల్‌ ‌గా జరుగుతుందని దానిని పారదర్శకంగా నిర్వ హించడానికి ఇతరుల జోక్యాన్ని తగ్గించడానికి, దరఖాస్తుదారుడు ఆఫీస్‌కి రావలసిన అవసరం లేకుండా స్పెషల్‌ ‌రిజర్వేషన్‌ ‌నెంబర్‌ ‌రిజర్వేషన్‌ ‌కోసం ఇ-బిడ్డింగ్‌ ‌విదానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. తెలంగాణాకు గుండెకాయ లాంటిది రవాణాశాఖా కార్యాలయమని అన్నారు. రవాణా శాఖలో ఆర్టీసి భాగస్వామ్యం అయిందని చెప్పా రు. ఫ్యాన్సీ నెంబర్లకోసం ఇ-బిడ్డింగ్‌ ‌విధానం అమలులోకి తెస్తున్నట్లు చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చన్నారు.

ఇ-బిడ్డింగ్‌ ‌విధనాంతోపాటు మొత్తం 59 సర్వీ సులు ఆన్‌లైన్‌లో ఉన్నాయన్నారు. గతంలో ఉన్న పథకాలను కొనసాగిస్తామనిచ గతంలో ఉన్న ఆర్టీసికి భిన్నంగా కొత్త ఆర్టీసిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరలో ఆర్టీసి లో చాలా మార్పులు జరగబోతున్నాయని ఆయన వెల్లడించారు. ఆర్టీసిలో 50 కార్గో బస్సులు సిద్దంగా ఉన్నాయ న్నారు. త్వరలోనే సిఎం కేసిఆర్‌ ‌వీటిని ప్రారంభి స్తారని చెప్పారు. ప్రతి డిపోను లాభాల్లో నడిపేందుకు అధికారులు దత్తత తీసు కుని చర్యలు తీసుకుంటామన్నారు. గత నెలలో ఆర్టీసి సొంత ఆదాయంతో ఉద్యోగులకు జీతాలి చ్చిందని, ఇది శుభపరిణామన్నారు. ఈనెలలో 16.8 కోట్ల ఆదాయం వచ్చిందని, కొ•త్తనిర్ణయా లు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. మేడారం జాతరకు 4వేల బస్సులను ఏర్పాటుచేసి బేస్‌క్యాంపులను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఈ వారం మొత్తం రోడ్డు భద్రతపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు, ఆర్టీసి రూట్లలో ప్రవేటు బస్సులను నడపదన్నారు. 1500 కోట్లు బడ్జెట ఇవ్వాలని ప్రతిపాదన పెట్టామని, మార్చి 31లోపు సమ్మెకాలం జీతం చెల్లిస్తామన్నారు.

Tags: E-bidding along with variety,Transportation, services are more, transparent Minister, Puvvada Ajaykumar

Leave a Reply