Take a fresh look at your lifestyle.

దేశంలో ఇక..పారదర్శక పన్నుల విధానం

  • ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు
  • పన్నుల రేట్లు తగ్గింపు, నిబంధనల సరళీకరణలే లక్ష్యం
  • నిజాయితీగా పన్ను చెల్లించేవారికి పారదర్శక వేదికలు
  • సెప్టంబర్‌ 25 ‌నుంచి ఫేస్‌లెస్‌ అప్పీల్‌ ‌సేవలు
  • కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

ఆదాయపన్ను వ్యవస్థ బలోపేతానికి మరిన్ని సంస్కరణలు తీసుకువస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం పారదర్శక పన్నుల విధాన పథకంను ప్రారంభించారు. ’ట్రాన్స్‌పరెంట్‌ ‌ట్యాక్సేషన్‌- ‌హానరింగ్‌ ‌ద హానెస్ట్’ ‌పథకం లక్ష్యాలను వివరించారు. బ్రిటిష్‌ ‌కాలం నాటి పన్నుల విధానానికి చెల్లుచీటి పలుకుతున్నామని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు ’పారదర్శక పన్నుల విధాన వేదిక’ ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా మోదీ గురువారం పారదర్శక పన్నుల విధాన వేదిక కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రారంభించారు.ఈ సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అవసరమన్నారు. ప్రత్యేక వేదిక ద్వారా సులువుగా ఫిర్యాదు చేయవచ్చునని వ్యాఖ్యానించారు. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ప్రత్యేక వేదిక ఎంతో ఉపయోగమన్నారు. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరమని మోదీ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులు మరింత పెరిగే అవకాశం ఉందని, సెప్టెంబరు 25 నుంచి ఫేస్‌లెస్‌ అప్పీల్‌ ‌సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

ఇప్పటికే ఆదాయ, కార్పొరేటు పన్ను తగ్గించామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఇలాంటి పారదర్శక వేదికలు మరింత లబ్ది చేకూరుస్తాయి. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరం ఉందని మోదీ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అవసరమని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు వచ్చాయి. సెప్టంబర్‌ 25 ‌నుంచి ఫేస్‌లెస్‌ అప్పీల్‌ ‌సేవలను ప్రారంభించ నున్నట్లు మోదీ తెలిపారు. ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందని, గతేడాది కార్పొరేట్‌ ‌ట్యాక్స్ ‌రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, కొత్త తయారీ సంస్థలకు దీన్ని పదిహేను శాతం చేశామని వివరించింది. డివిడెండ్‌ ‌డిస్టిబ్య్రూషన్‌ ‌పన్నును కూడా రద్దు చేసినట్లు తెలిపింది. పన్నుల రేట్లు తగ్గింపు, నిబంధనల సరళీకరణలే లక్ష్యంగా ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మోదీ తెలిపారు.  పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర ప్రభుత్వం మరింత సరళమైన, సౌకర్యవంతమైన విధానాన్ని ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు స్కుట్రినీ కోసం, అప్పీళ్ల కోసం నేరుగా హాజరయ్యే అవసరం లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సరికొత్త వేదికను ప్రారంభించారు. సకాలంలో పన్ను బకాయిలు చెల్లించి దేశ నిర్మాణం కోసం తోడ్పాటు అందించాలని ప్రధాని ఈ సందర్భంగా ప్రజలను అభ్యర్థించారు.

అటు పన్ను చెల్లింపుదారులు, ఇటు అధికారులకు సంబంధించిన హక్కులు, బాధ్యతలను నిర్దేశిరచే పన్ను చెల్లింపుదారుల చార్టర్‌ ‌కూడా ఐటీ శాఖ అమలుచేయనుంది. అతి తక్కువ కార్పొరేట్‌ ‌పన్నులను వసూలు చేసే దేశాల్లో భారత్‌ ‌కూడా ఒకటనీ.. భారత పన్ను వ్యవస్థలో ప్రాథమిక సంస్కరణలు అవసరమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పన్నువిధానం అతుకులు లేకుండా, నొప్పి లేకుండా, పన్నుదారుడు నేరుగా హాజరు కాకుండా ఉండే విధంగా తయారు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నవారిని మరింత ప్రోత్సహిస్తామన్నారు. ప్రత్యేక వేదిక ద్వారా ఫిర్యాదులు సులువుగా చేయవచ్చు అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను విధానంలో మరిన్ని సంస్కరణలను తీసుకువస్తున్నట్లు తెలిపారు. పారదర్శక పన్నువిధానంలో ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌ అతిపెద్ద సంస్కరణ అన్నారు.   ఫేస్‌లెస్‌ అపీల్‌, ‌పన్నుదారుల పట్టిక కూడా సంస్కరణలో భాగమే అన్నారు.  ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌, ‌ట్యాక్స్ ‌పేయర్‌ ‌చార్టర్‌లు నేటి నుంచే అమలులోకి వస్తాయన్నారు. ఏదో ఒక వత్తిడిలో సంస్కరణల పేరుతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని, అలాంటి వాటితో లక్ష్యాలను చేరుకోలేమన్నారు. అలాటి ఆలోచన, వ్యవహారం అన్నీ మారినట్లు ప్రధాని తెలిపారు. పన్నువిధానాన్ని సాఫీగా తయారు చేయడం తమ ఉద్దేశమన్నారు. దేశాభివృద్ధి ప్రయాణంలో పన్నుదారుడి చార్టర్‌ ‌కూడా పెద్ద ముందడుగే అని తెలిపారు. పన్నుదారులను మరింత శక్తివంతంగా తయారు చేయడమే ప్రధాని లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌తెలిపారు.  పన్నవిధానంలో పారదర్శకత ఉండాలని, నిజాయితీపరుడైన పన్నుదారుల్ని గౌరవించాలన్నదే ప్రధాని లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్‌ ‌సింగ్‌ ‌ఠాకూర్‌లతోపాటు దేశంలోని వాణిజ్య సంస్థలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, గణనీయమైన పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్లు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply