Take a fresh look at your lifestyle.

విధి నిర్వహణలో పారదర్శకతకే నూతన టెక్నాలజీ

గతంలో నేరాల చేదనలో పోలీసులు ఎదుర్కోన్న సమస్యల నుంచి నేడు వినియోగిస్తున్న నూతన టెక్నాలజితో పోలీసుల విధినిర్వహాణలో పారదర్శకతను పెంచుతోందని కరీంనగర్‌ ‌రెంజ్‌ ఐజి ప్రమోద్‌ ‌కుమార్‌ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా పోలీస్‌ ‌పరిపాలనా కార్యాల యం సమీపంలో ట్రాఫిక్‌ ‌నిబందనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన రోడ్‌ ‌సేఫ్టి మొబైల్‌ ఎగ్జిబిషన్‌ ‌వాహనాన్ని ఐజి జెండాఊపి ప్రారంబించారు. అనంతరం అయన మాట్లాడుతూ గతంలో నేరాలను చేదించేందుకు పోలీసులు నానా అవస్థలు పడేవారన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ ‌వ్యవస్థను బలోపేతం చేసి ఆధునిక టెక్నాలజిని అందుబాటులోకి తేవడంతో పోలీసుల విధుల్లో పారదర్శకత పెరిగిందన్నారు. ఈ టెక్నాలజితో కేవలం ప్రజలకు, నేరాల నియంత్రణ, చేధనకే కాకుండా పోలీసుశాఖలోను సిబ్బంది అవసరాలకై ప్రత్యేక యాప్‌లను రూపోందించి సత్వరమే పోలీసులకు సేవలను అందించే ఏర్పాట్లు జరిగాయన్నా రు. పోలీసు స్టేషన్ల వారీగా నమోదవుతున్న  కేసుల సంఖ్యను సిసిటిఎన్‌ఎస్‌ ఎప్పటికప్పుడు నమోదు చేయడంతోపాటు అరెస్ట్‌లు, కోర్టులకు సరెండర్ల వంటి ఎన్నో పనులను ఈ యాప్‌ల ద్వారా సత్వరమే పూర్తవుతున్నాయన్నారు. ట్రాఫిక్‌ ‌విభాగంలో పారద ర్శత కోసం ఈపెట్టి కేసేస్‌, ఈ ‌చలాన్ల అప్లికేషన్లను వినియోగిస్తున్నామన్నారు. ఈ యాప్‌ల వినియోగంతో   పోలీసుల పనితీరుపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నా రు.

విధి నిర్వహాణలో పోతున్న పోలీసుల సమయాన్ని వృదా చేయకుండా ఉండడానికి పోలీసు వాహనాలన్ని జిపిఎస్‌ ‌ద్వారా అనుసందానం చేసి ఎప్పటికప్పుడు పోలీసు వాహనాల మూమెంట్‌ను గుర్తిస్తున్నామన్నారు. తీరికలేకుండా పోతున్న ప్రజలను అన్‌లైన్లలో మోసాల కు గురిచేస్తున్న   సైబర్‌ ‌నేరగాళ్ళను అరికట్టేందుకు సైబర్‌‌క్రైం ల్యాబ్‌ ఎన్నో సేవలను అందిస్తోందన్నారు. జేఆర్‌ఎమ్మెస్‌ ‌యాప్‌ ‌ద్వారా జైలు నుంచి విడుదలైన వ్యక్తుల కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు వినియోగిస్తున్నామన్నారు. కేవలం ప్రజల అవసరాలకే కాకుండా పోలీసు అధికారులు, సిబ్బంది 665 మంది సర్విస్‌ ‌రికార్డులను అన్‌లైన్లో నమోదు చేశారన్నారు. ఏదైనా నేర సంఘటన జరిగిన సందర్బంలో సిడిఆర్‌ ‌ద్వారా అక్కడి అనుమానిత వ్యక్తి వినియోగించిన ఫోన్‌ ‌నెంబర్ల ద్వారా నేర సమాచారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు కృషిచేస్తున్నారని తెలిపారు. కొన్ని కేసులలో పోలీస్‌స్టేషన్లకు రాలేని బాదితుల సహయార్థం జిల్లా వాట్సప్‌ ‌గ్రివెన్స్ ‌సెల్‌ను ఏర్పాటు చేసి వారి ఫిర్యాదుల న స్వీకరించి సత్వరమే సమస్యను పరిష్కరించేందుకు జిల్లా పోలీసులు కృషిచేస్తున్నారని ఐజి ప్రమోద్‌కుమార్‌ ‌తెలిపారు.ఈ కార్యక్రమములో జిల్లా ఎస్పి సింధూశర్మ, అడిషనల్‌ ఎస్పి దక్షిణామూర్తి, డియస్పిలు వెంకటరమణ, ప్రతాప్‌, ఆర్‌పి సిఐలు, డిసిఆర్‌బి పోలీసుల ఉన్నారు.

Leave a Reply