Take a fresh look at your lifestyle.

మున్సిపల్‌ ‌కమిషనర్ల మూకుమ్మడి బదిలీ

Transfer of Municipal Commissioners

  • సదస్సుకు గంట ముందు ఉత్తర్వులు
  • ఒకే రోజు 35 మందికి స్థానచలనం

తెలంగాణలో ఆకస్మికంగా మున్సిపల్‌ ‌కమిషనర్ల మూకుమ్మడి బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 35 మంది మున్సిపల్‌ ‌కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పట్టణ ప్రణాళిలక•• శ్రీకారం చుట్టబోతున్న తరుణంలో ప్రభుత్వం కీలక బదిలీలకు నిర్ణయించింది. ప్రణాళిక కోసం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌ ‌సమావేశం ఏర్పాటుచేసి చర్చిస్తున్న తరుణంలో ఈ బదిలీలు జరగడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 35 మంది మున్సిపల్‌ ‌కమిషనర్లను బదిలీలు చేసింది ప్రభుత్వం. కల్వకుర్తి కమిషనర్‌గా జకీర్‌ అహ్మద్‌, ‌బెల్లంపల్లి కమిషనర్‌గా ఆకుల వెంకటేశ్‌, ‌లక్షెట్టిపేట్‌ ‌కమిషనర్‌గా త్రయంబకేశ్వర్‌రావు బదిలీ అయ్యారు. నాగర్‌కర్నూల్‌ ‌కమిషనర్‌గా గోనే అన్వేశ్‌ , ‌జగిత్యాల కమిషనర్‌గా జయంత్‌కుమార్‌రెడ్డి, నిర్మల్‌ ‌కమిషనర్‌గా నల్లమాల బాలకృష్ణ, అన్‌పూర్‌ ‌కమిషనర్‌గా సుజాత, హాలియా కమిషనర్‌గా వేమనరెడ్డి, తెల్లాపూర్‌ ‌కమిషనర్‌గా వెంకట మణికరణ్‌ ‌బదిలీ అయ్యారు.అదేవిధంగా షాద్‌నగర్‌ ‌కమిషనర్‌గా లావణ్య, సంగారెడ్డి కమిషనర్‌గా శరత్‌చంద్ర, జిహెచ్‌ఎం‌సిలో డిప్యూటీ కమిషనర్‌గా ప్రశాంతిని ట్రాన్స్‌ఫర్‌ ‌చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరు మున్సిపాలిటీకి కే. శ్రీనివాస్‌రెడ్డి,శంషాబాద్‌ ‌మున్సిపాలిటీకి ఎండీ షబ్బీర్‌అలీ,నర్సంపేట మున్సిపాలిటీకి ఎస్‌.‌విద్యాధర్‌, ‌పరకాల మున్సిపాలిటీకి బి.యాదగిరి,పెద్దపల్లికి చాడల తిరుపతి, వేములవాడకు మట్ట శ్రీనివాస్‌ ‌రెడ్డి, సత్తుపల్లికి కే. సుజాత, ఇల్లందుకు వీరేందర్‌, ‌మందమర్రి •కి గద్దె రాజు, వనపర్తి మున్సిపాలిటీకి మహేశ్వర్‌ ‌రెడ్డి, జీహెచ్‌ఎం‌సీ డిప్యూటీ కమిషనర్‌గా రజినీకాంత్‌ ‌రెడ్డిలు నియమితులయ్యారు.

సదాశివపేట మున్సిపాలిటీకి ఖమర్‌, ఎల్లారెడ్డికి అహ్మద్‌, ‌హుజుర్‌నగర్‌కు బట్టు నాగిరెడ్డి, కామారెడ్డి మున్సిపాలిటీకి బి.గంగాధర్‌, ‌యాదగిరిగుట్టకు జంపాలా రజిత, నందికొండకు పల్లారావు, చిట్యాల మున్సిపాలిటీకి ప్రభాకర్‌ ‌బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎం‌సీ డిప్యూటీ కమిషనర్లుగా త్రిల్లేశ్వర్‌, ‌ముకుంద్‌ ‌రెడ్డిలు, డైరెక్టర్‌ ఆఫ్‌ ‌మున్సిపల్‌ అడ్మినిస్టేష్రన్‌ ‌జాయింట్‌ ‌డైరెక్టర్‌గా నళిని పద్మావతి, డైరెక్టర్‌ ఆఫ్‌ ‌మున్సిపల్‌ అడ్మినిస్టేష్రన్‌ ‌డిప్యూటీ డైరెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి, ఆమన్‌గల్‌ ‌మున్సిపల్‌ ‌కమిషనర్‌గా శ్యామ్‌సుందర్‌ ‌నియమితులయ్యారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy