Take a fresh look at your lifestyle.

‘‌జ్ఞానవాపి’ కేసు జిల్లా జడ్జికి బదిలీ

  • సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన నిర్ణయం
  • మసీదులో ప్రార్థనలను యథావిధిగా కొనసాగించాలని ఆదేశం
  • మీడియాకు లీకులపై ధర్మాసనం ఆగ్రహం

న్యూ దిల్లీ, మే 20(ఆర్‌ఎన్‌ఎ) : ‌వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో సర్వే కోసం సివిల్‌ ‌జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీమ్‌ ‌కోర్టు శుక్రవారం చెప్పింది. అయితే విచారణను సివిల్‌ ‌జడ్జి నుంచి వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. ఈ మసీదుని నిర్వహిస్తున్న అంజుమన్‌ ఇం‌తెజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ మసీదు సముదాయంలో వీడియోగ్రాఫిక్‌ ‌సర్వేకు ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ కమిటీ సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించింది.

ఈ మసీదు ప్రాంగణంలో శివలింగం, త్రిశూలం, కమలం వంటి హిందూ సంబంధిత అంశాలు ఈ సర్వేలో కనిపించినట్లు వార్తలు రావడంతో హిందువులు ఇక్కడ పూజలు చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కేసును వారణాసి జిల్లా సీనియర్‌ ‌మోస్ట్ ‌జడ్జి విచారించాలని సుప్రీమ్‌ ‌కోర్టు శుక్రవారం ఆదేశించింది. మరింత అనుభవజ్ఞుడైన న్యాయాధికారి విచారణ జరిపితే బాగుంటుందని తెలిపింది. కొన్ని వీడియోలను బయటకు పొక్కేలా చేయడాన్ని ఆపాలని ఆదేశించింది. ఈ అంశం సంక్లిష్టత, సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకుని, వారణాసిలోని సివిల్‌ ‌జడ్జి సమక్షంలో విచారణలో ఉన్న సివిల్‌ ‌దావాను ఉత్తర ప్రదేశ్‌ ‌జ్యుడిషియల్‌ ‌సర్వీస్‌లోని సీనియర్‌, అనుభవజ్ఞుడైన జ్యుడిషియల్‌ ఆఫీసర్‌ ‌విచారిస్తే బాగుంటుందని సుప్రీమ్‌ ‌కోర్టు పేర్కొంది. అయితే గతంలో ఆదేశాలు ఇచ్చిన సివిల్‌ ‌జడ్జిపై తన ఆదేశాల ప్రభావం ఏవి• ఉండదని స్పష్టం చేసింది. శివలింగం కనిపించినట్లు చెప్తున్న ప్రాంతాన్ని పరిరక్షిస్తూనే, ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి ఆటంకం లేకుండా చూడాలని మే 17న ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు కొనసాగుతాయని చెప్పింది.

- Advertisement -

వివిధ వర్గాల మధ్య సౌభ్రాతృత్వం, శాంతియుత పరిస్థితులు ప్రస్తుతం చాలా అవసరమని వివరించింది. క్షేత్ర స్థాయిలో సంతులనం, ప్రశాంతత అవసరమని తెలిపింది. తాత్కాలిక ఆదేశాలతో మనకు కొంత సాంత్వన భావం కలగాలని జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ అన్నారు. దేశంలో సంతులన భావాన్ని కాపాడే ఉమ్మడి కార్యక్రమంలో మనం భాగస్వాములమని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. అయితే జ్ఞాన్‌వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ వాడివేడీగా సాగింది. ఈ తరుణంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అనే సస్పెన్స్ ‌వీడింది.

జిల్లా కోర్టులోనే విచారణకు మొగ్గు చూపిన సుప్రీమ్‌ ‌కోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఇదొక సంక్లిష్టమైన, సున్నితమైన అంశమని పేర్కొంది. ఈ కేసు పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమన్న బెంచ్‌.. ‌జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ ‌శివలింగాన్ని సంరక్షించడంతో పాటు నమాజ్‌ ‌కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలను మాత్రం కొనసాగించాలని తెలిపింది.  అడ్వొకేట్‌ ‌కమిషన్‌ ‌రూపొందించిన రిపోర్ట్.. ‌బయటకు పొక్కడంపై సుప్రీమ్‌ ‌కోర్టు సీరియస్‌ అయ్యింది. ప్రత్యేకించి కొన్ని లీకులు వి•డియాకు చేరుతున్నాయి. అది కోర్టుకు సమర్పించే అంశం. కోర్టులో జడ్జే కదా దానిని తెరవాల్సింది అని జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు కమిటీ రూపొందించిన రిపోర్ట్‌లోని వివరాలు బయటకు పొక్కడం కలకలం రేపుతోంది.

Leave a Reply