Take a fresh look at your lifestyle.

వొచ్చేడాది సిద్ధిపేటకు చిక్‌బుక్‌చిక్‌: ‌మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, మే 27 (ప్రజాతంత్ర బ్యూరో): వచ్చే ఏడాది డిసింబర్‌ ఆఖరికల్లా సిద్ధిపేట పట్టణానికి చిక్‌బుక్‌చిక్‌ (‌రైలు)ను తీసుకు వస్తామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. ఆ దిశగా రైల్వే, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు గురువారం సిద్ధిపేట కలెక్టరేట్‌ ‌మీటింగ్‌ ‌హల్‌లో జిల్లాలో రైల్వే లైన్‌ ‌పనుల పురోగతిపై రైల్వే, రెవెన్యూ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. సిద్ధిపేట జిల్లాలో రైల్వే లైన్‌ ‌నిర్మాణానికి మొత్తం 759 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటికే 719 ఎకరాల భూ సేకరణ పూర్తి చేశామన్నారు.మిగిలిన 40 ఎకరాల భూ సేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైల్‌లైన్‌ ‌నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా రైల్వే అధికారులకు అప్పగించాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. సిద్ధిపేట రైల్వే స్టేషన్‌ ‌బిల్డింగ్‌ ‌పనులు లాక్‌డౌన్‌ ‌వల్ల ఆగిపోయాయని రైల్వే అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ ‌ముగిసిన వెంటనే పనులు పనులు వేగంగా చేపట్టి పూర్తి చేయాలన్నారు.

225 కోట్ల రూపాయలతో దుద్దెడ నుండి సిద్దిపేట వరకు 17కిలో మీటర్ల మేర నిర్మించనున్న రైల్వే లైన్‌ ‌పనుల కు వారం రోజుల్లోగా టెండర్లు పిలవాలని మంత్రి హరీష్‌రావు రైల్వే అధికారులను ఆదేశించారు. గజ్వేల్‌ ‌నుంచి కొడకొండ్ల వరకు రైల్వే లైన్‌ ‌నిర్మాణం పూర్తికి ప్రస్తుత సంవత్సరాంతంలోగా పూర్తి చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామ రెడ్డి, అదనపు కలెక్టర్‌ ‌ముజమ్మిల్‌ఖాన్‌, ‌సిద్ధిపేట ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్‌ ‌విజయ్‌, ‌దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్‌ ఇం‌జనీర్‌ ‌సధర్మ రాయుడు, రైల్వే అధికారిక యంత్రాంగం సోమరాజు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply