Take a fresh look at your lifestyle.

గిరిజనుల వద్దకు కాలిబాటన కలెక్టర్‌

కాలిబాటన నడుస్తున్న కలెక్టర్‌ ‌కర్ణన్‌
‌గిరిజనుల సమస్యలు తెలుసుకునేం దుకు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ‌శుక్రవారం క్షేత్రస్ధాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు…లాక్‌ ‌డౌన్‌ ‌నేపధ్యంలో గిరిజనుల చెంతకు వెళ్ళి వా రి స్థితి గతులను తెలుసుకునేందుకు కాలిబాట పట్టారు. గిరిజనుల వద్దకు వెళ్ళిన కలెక్టర్‌ ‌కర్ణన్‌ ‌వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌తో పాటు వేసవితీవ్రత అధికంగా ఉన్న నేపధ్యంలో మంచినీరు,నిత్యవసర వస్తువులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా ఇళ్ళలోకి వెళ్ళి గృహలను పరిశీలించారు. ప్రభుత్వ పరంగా అందరి స్థితిగతులు మారేలా సంక్షేమ అభివృద్ది పలాలు అందేలా చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. దీం తో గిరిజన,ఆదివాసులలో ఆనందం వెల్లివిరిసింది.కామేపల్లి మండలం అడవి మద్దులపల్లి అటవీ ప్రాంతంలో ఆదివాసీల నివాసాలను వారి జీవన స్థితిగతులను జిల్లా కలెక్టర్‌ ఆర్‌.‌వి.కర్ణన్‌ ‌పరిశీలించారు. కరోనా వైరస్‌ ‌ప్రభావంతో లాక్‌ ‌డౌన్‌ ‌కొనుసాగుతన్న నేపథ్యంలో ఆదివాసీల గృహాలను పరిశీలించి వారి స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నా రు.

వారి ఆరోగ్య పరిస్థితులను, ప్రభుత్వం అందించే నగదు, బియ్యం అందుతున్నాయ లేదా అనివారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం నుంచి అందించే సాయం ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని తహశీల్దారును ఆదేశించారు. వేసవి దృష్ట్యా వారి గృహాలకు త్రాగునీరు, విద్యుత్‌ అం‌తరాయం రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రేషన్‌ ‌కార్డు లేని వారికి వెంటనే రేషన్‌ ‌కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. అనంతరం కామేపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ ‌సందర్శించి వైద్యధికారికి పలు సూచనలు చేశారు. ఆదివాసీల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పరీక్షించాలని వైద్యధికారికి కలెక్టర్‌ ‌సూచించారు. కరోనా వైరస్‌ ‌పట్ల ఆదివాసీలకు అవగాహన కల్పించాలని, పరిశుభ్రత పాటించే విధంగా, మాస్కులు ధరించేలా అవగహన కల్పించి భౌతిక దూరం పాటించేలా తెలియజేయాలన్నారు. ప్రతిరోజు వస్తున్న అవుట్‌ ‌పేషెంట్లు, ఇన్‌ ‌పేషంట్లకు అందిస్తున్న వైద్య సౌకర్యాలు వివరిం చాలని ఆదేశించారు. మండల వైద్యాధికారి స్రవంతి, తహశీల్దారు నర్సింహారావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply