Take a fresh look at your lifestyle.

ఎం‌జిఎంలో విషాదం వెంటిలేటర్‌ ‌పనిచేయక కొరోనా వ్యాధిగ్రస్తుని మృతి

ఎంజిఎం, మార్చి 20, (ప్రజాతంత్ర విలేకరి): వరంగల్‌ ఎం‌జిఎం హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్‌ ‌వార్డులో వెంటిలేటర్‌ ‌పని చేయకపోవడంతో ఆక్సిజన్‌ అం‌దక కొరోనా వ్యాధిగ్రస్తుడు మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. ఎంజిఎం కోవిడ్‌ ‌వార్డులో విద్యుత్‌ ‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ వార్డులలోని వెంటిలేటర్‌లు పని చేయలేదు. దీంతో వార్డులో వెంటిలేటర్‌ ‌పై చికిత్స పొందుతున్న వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా కమలాపురంకు చెందిన గాంధీ(38) మృతి చెందాడు.

గత నెల 24న కొరోనాతో చికిత్స కోసం ఎంజిఎంలో చేరాడని వెంటిలేటర్‌ ‌పని చేయకపోవడంతో ఊపిరి అందక మరణించినట్లు చెబుతున్నారు. కాగా ఎంజిఎం సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ ‌నాగార్జున రెడ్డి స్పందిస్తూ ఈ దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. వెంటిలేటర్‌లకు విద్యుత్‌ అం‌దకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని, అప్పటికప్పుడే మరో వెంటిలేటర్‌ను సమకూర్చామని అంతలోనే మృతి చెందాడని, అయితే సకాలంలో సిబ్బంది స్పందించకపోవడం పై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply