Take a fresh look at your lifestyle.

అ‌క్రమ రవాణా చేస్తున్న పిడిఎస్‌ ‌బియ్యం పట్టివేత : సిపి

పేదల బియ్యంతో వ్యాపారం చేస్తూ అక్రమంగా రవాణా చేస్తున్న 350 క్వింటాళ్ళ పీడీఎస్‌ ‌బియ్యంను స్వాధీనం చేసుకుని, నలుగురు అక్రమ రవాణాదారులను రామగుండం టాస్క్‌ఫోర్స్ ‌పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం రామగుండం పోలీస్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్ల ఆవరణలో రామగుండం సీపీ విలేఖరుల సమావవేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడారు. పెద్దపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని పెద్దకాల్వల గ్రామ శివారులో పిడిఎస్‌ ‌రైస్‌ ‌సుల్తానాబాద్‌ ‌మండలం వివిధ ప్రాంతాల నుండి సేకరించి జూలపల్లి మండలం ర్యాకలదేవ్‌ ‌పల్లి లోని గంగిరేద్దుల వారి కాలనీ లో భద్రపరిచి ఈ రోజు ఉదయం జీజె11వివి 4111 నెంబర్‌ ‌గల లారీలో లోడ్‌ ‌చేసి మహారాష్ట్ర లోని వీరూరు లో రైస్‌ ‌మిల్లులకు కు అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమచారంతో దాడి నిర్వహించి పిడిఎస్‌ ‌రైస్‌ ‌లోడ్‌ ‌చేసిన లారీ మరియు ఒక బైక్‌ ‌స్వాధీన పరుచుకొని నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగినట్లు వివరించారు. ఈ రోజు పట్టుబడిన వ్యక్తులు మోటం గురువయ్య, వారణాసి రమేష్‌, ‌శ్యామ లారయ్యా, భీమా భాయిలపై గతంలో కూడా పెద్దపల్లి జిల్లా వివిధ పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలలో పిడిఎస్‌ ‌రైస్‌ అ‌క్రమ రవాణా కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు.

పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే సదుద్దేశ్యంతో క్వింటాలుకు సుమారు రూ. 2500 సబ్సిడీని భరిస్తూ అందజేస్తుంటే లబ్దిదారులు వాటిని అమ్ముకోవడం చేస్తుందన్నారు. ప్రతిరోజు దాదాపు కోటి రూపాయల విలువైన బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని వివరించారు. క్వింటాల్‌ ‌బియ్యాన్ని రూ .800 నుంచి రూ .1000 కి కొను గోలు చేసి మహారాష్ట్రలో క్వింటా రూ .2 వేల నుంచి రూ .2500 కు విక్ర యిస్తూ అధిక డబ్బులు సంపాదిస్తున్నారు అని మా విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. కరీంనగర్‌, ‌వరంగల్‌ ‌ప్రాంతాల నుండి కొంతమంది పిడిఎస్‌ ‌బియ్యంను అక్రమ రవాణా చేసే స్మగ్లర్‌ ‌లు పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌ ‌నగర్‌, ఆసిఫాబాద్‌ ‌వాంకిడి మీదుగా డిసిఎం వ్యాన్‌, ‌లారీల్లో మహారాష్ట్ర కు తరలిస్తున్నారు. మరికొందరు రేషన్‌ ‌బియ్యాన్ని నూకలుగా మార్చి తరలిస్తున్నారు. నూకలకు కూడా బియ్యం ధరనే చెల్లిస్తుండడంతో ఈ అక్రమ రవాణా కుడా చేస్తున్నారు. రామగుండం కమీషనరేట్‌ ‌పరిధిలోని మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాలోని పిడిఎస్‌ అ‌క్రమ రవాణా చేసేవారి మరియు సకహరించే వారి వివరములు గ్రామీణ స్థాయి నుండి పిడిఎస్‌ ‌బియ్యం సేకరించే వారి, డీలర్స్, అ‌క్రమ రవాణా చేసే సుమారు 60 మంది జాబి తా సిద్దం చేయడం జరిగినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర లోని గొండియ ప్రాంతంలోని స్మగ్లర్‌ ‌ల జాబితా కూడా సిద్దం చేయడం జరిగినట్లు వీరిపై త్వరలో చట్టరీత్య కేసులు నమోదు చేసి కఠిన చర్యలకు సిద్దమైనట్లు హెచ్చరించారు. ఈ సంధర్భంగా చాకచక్యంగా అక్రమ రవాణాను అడ్డుకున్న టాస్క్‌ఫోర్స్ ‌సీఐ రాజ్‌కుమార్‌, అధికారులు, సిబ్బందిని అభినందించారు.

Leave a Reply