Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ సందర్భంగా ట్రాఫిక్‌ ఆం‌క్షలు

నేడు హైటెక్స్‌లో  నిర్వహించనున్న టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్లీనరీ సందర్భంగా హైటెక్స్ ‌పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆం‌క్షలుంటాయని ట్రాఫిక్‌ ‌డీసీపీ విజయ్‌కుమార్‌ ఓ ‌ప్రకటనలో తెలిపారు. నీరూస్‌ ‌జంక్షన్‌, ‌సైబర్‌ ‌టవర్‌ ‌క్రాస్‌రోడ్స్, ‌మెటల్‌ ‌చార్మినార్‌, ‌గూగుల్‌ ‌జంక్షన్‌, ‌కొత్తగూడ జంక్షన్‌, ‌ఖానామెట్‌ ‌జంక్షన్‌, ‌బయోడైవర్సిటీ జంక్షన్‌, ‌గచ్చిబౌలి బొటానికల్‌గార్డెన్‌ ‌జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్‌ ‌మళ్లింపు ఉంటుందని అన్నారు.

నీరూస్‌ ‌జంక్షన్‌ ‌నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలను అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌, ‌దుర్గంచెరువు, ఇనార్బిట్‌, ఐటీసీ కోహినూర్‌, ఐకియా, బయోడైవర్సిటీ వైపు మళ్లిస్తారని, మియాపూర్‌, ‌కొత్తగూడ, హఫీజ్‌పేట్‌ ‌నుంచి హైటెక్‌ ‌సిటీ, జూబ్లీహిల్స్‌కు వెళ్లే వాహనదారులను రోలింగ్‌ ‌హిల్స్, ఏఐజీ హాస్పిటల్‌, ఐకియా, ఇనార్బిట్‌, ‌దుర్గం చెరువు మీదుగా పంపుతారని, ఆర్‌సీపురం, చందానగర్‌ ‌నుంచి మాదాపూర్‌, ‌గచ్చిబౌలి వైపు వొచ్చే వాహనాలు బీహెచ్‌ఈఎల్‌, ‌నల్లగండ్ల, హెచ్‌సీయూ. ఐఐఐటీ, గచ్చిబౌలి వైపు వెళ్లాల్సి ఉంటుందని డిసిపి వెల్లడించారు.

టీఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ సందర్భంగా ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply