- పల్లెల్లో ట్రాక్టర్ కొనుగోళ్లపై సర్పంచుల తర్జనభర్జన
- నిధులు లేక తలలు పట్టుకుంటున్న ప్రజాప్రతినిధులు.
- బ్యాంకులు సహకరించేనా..?
మండలంలో ఒక్కో పంచాయతీకి ఒక ట్రాక్టర్. ట్రాలీ. వాటర్ ట్యాంక్. సెట్ ను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటి కొనుగోళ్లను పంచాయతీ పాలకవర్గాలే నిధులు సమకూర్చుకోవాలని సూచించింది.14వ ఆర్థిక సంఘం నిధులను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులను వినియోగించుకోవాలని అధికారులు సర్పంచులకు సూచించారు. అధికారులు ట్రాక్టర్ కొనాల్సిందే అని సర్పంచులు పై ఒత్తిడి చేస్తున్నారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ 30 రోజుల ప్రణాళిక ను ముప్పుతిప్పలు పడి పూర్తి చేశారు. ఇప్పుడు పంచాయతీల నెత్తిన ట్రాక్టర్లు కొనుగోలు భారాన్ని మొపుతున్నారని సర్పంచ్ లు వాపోతున్నారు.రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో తిప్పలు పడి 30 రోజుల ప్రణాళిక ను పూర్తి చేశారు. ఈ క్రమంలో పంచాయతీలో నిధులు లేకపోవడంతో ట్రాక్టర్లు కొనుగోలు భారాన్ని మోపుతున్నారు అని సర్పంచ్ లు వాపోతున్నారు.ప్రభుత్వం చెబుతున్న లెక్కలను బట్టి 500 జనాభా ఉన్న పంచాయతీలను కు 15 హార్స్ పవర్ గల మినీ ట్రాక్టర్.500 నుండి మూడు వేల జనాభా వరకు 20 నుండి 21 హార్స్ పవర్ గల మినీ ట్రాక్టర్ 3,000 పైన జనాభా ఉన్న పంచాయతీలను 35 నుండి 46 పరుగుల ట్రాక్టర్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని. మినీ ట్రాక్టర్ నాలుగు లక్షల నుండి 5 లక్షల వరకు ఉండగా. రెగ్యులర్ ట్రాక్టర్ ఏడు లక్షల రూపాయలు అవుతుంది అన్నారు. ట్రాలీ ధర ఒక 1.50.000 ఉందని ఇవిగాక వాటర్ ట్యాంకర్. డోజర్ సెట్ ను ను కొనుగోలు చేయాల్సి రావడం కత్తిమీద సాములా తయారైందని వారు వాపోతున్నారు. కనీసం ఒక ట్రాక్టర్ ట్రాలీ కలిపి 7 నుంచి 9 లక్షల వరకు ఉంది అంటున్నారు.
బ్యాంకులు సహకరించే నా.
మండలంలో ట్రాక్టర్ల కొనుగోళ్లకు సంబంధించి బ్యాంకర్లతో మండల ప్రజా పరిషత్ అధికారులు బ్యాంకర్లతో మాట్లాడి 50% పంచాయతీ పాలకవర్గం చెల్లిస్తే మిగిలిన 50% నిధులను రుణం పేరుతో బ్యాంకులు చెల్లించేలా బ్యాంకులను ఒప్పించాలని వారు కోరుతున్నారు. కొంచెం డౌన్ పేమెంట్ తో కొన్ని కంపెనీలు ట్రాక్టర్లను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నా బ్యాంకర్లు ఏ మేరకు సహకరిస్తారు వేచి చూడాల్సి ఉంటుందని సర్పంచులు అధికారులు అంటున్నారు.
..నిధులు ఉన్న గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లు కొనుగోలు చేయాల్సిందే
ఎంపీడీవో ధన్ సింగ్ నాయక్.
14వ ఆర్థిక సంఘం నిధులు ఉన్న గ్రామ పంచాయతీలు వెంటనే ట్రాక్టర్ ల ను కొనుగోలు చేయాల్సిందేనని ఎంపీడీవో ధన్ సింగ్ నాయక్ అన్నారు. నిధుల లేమి గ్రామపంచాయతీ సర్పంచులను ఒత్తిడి చేయటం లేదని ఆయన తెలిపారు. గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించేందుకు కంపల్సరిగా వాహనాలు ఉండాల్సిందేనని ఆయన అన్నారు.వాహనాలు ఉంటే హరిత హారంలో నాటిన మొక్కలకు ఎండాకాలంలో నీళ్ళు పోసేందుకు కూడా ఉపయోగపడతాయి అని నీటి ఎద్దడి గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణ కు వ్యవసాయ బావి నుంచి నీటిని తరలించేందుకు ఉపయోగపడతాయన్నారు.
Tags: Tractor,Democrats holding funds,banks cooperate