Take a fresh look at your lifestyle.

ప్రార్థనా మందిరాలను కూల్చినందుకు అధికారులను జైల్లో పెట్టాలి

  • తెలంగాణ ఉద్యమంలో నల్లపోచమ్మ ఆశిస్సులు ఉన్నాయి
  • టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

తెలంగాణ ఉద్యమానికి వేదికైన నల్లపోచమ్మ దేవాలయం, మజీద్‌ను అమానుషంగా కూల్చటాన్ని ఖండిస్తున్నామని మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సచివాలయంలోని ప్రార్ధనా మందిరాలను కూలగొట్టిన సీఎం, సీఎస్‌, ‌డీజీపీలకు బేడీలు వేసి చర్లపల్లి జైల్లో పెట్టాలన్నారు. రాత్రికి రాత్రే సచివాలయాన్ని పడగొట్టాలని సీఎం అధికారులను ఆదేశించారన్న రేవంత్‌ ‌ట్యాంక్‌ ‌బండ్‌, ‌ నెక్లెస్‌ ‌రోడ్‌ ‌సపంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయవద్దని సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పు ఉందని గుర్తు చేశారు. పర్యావరణాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా సీఎస్‌ ‌పెడచెవిన పెట్టారన్నారు. పర్యావరణ అనుమతులు వచ్చినాకనే సచివాలయాన్ని కూలగొట్టాలని అన్నారు. జవహర్‌ ‌నగర్‌లో ఎలాంటి చెత్త వేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని, సచివాలయ శకలాలు ఎక్కడ వేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. సచివాయాన్ని కూల్చడంపై ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వారు కేసీఆర్‌ ఎం‌గిలి మెతుకులకు ఆశ పడుతున్నార న్నారు. హిందు మతానికి.. సీఎంకు అనుకూలంగా స్టేట్‌ ‌మెంట్‌ ఇచ్చిన ఇద్దరు ముగ్గురు ఉద్యోగ సంఘాల నేతలతో పాటు సెక్రటేరియేట్‌కు చెందిన నరేంద్రరావు అనే ఉద్యోగ సంఘాల సన్నాసి యజమాని కాదని అన్నారు. మత విశ్వాసం ఉద్యోగ సంఘాలకు మాత్రమే సొంతం కాదని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలను చెప్పుతో కొట్టాలని అన్నారు. మసీదు, నల్ల పోచమ్మ గుడి కూల్చితే బీజేపీ, మజ్లిస్‌ ‌పార్టీ ల నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్‌, ‌బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌లు అన్ని ఒకే తాను ముక్కలన్నారు. దేవాలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ ‌స్పందించి దీనిపై బీజేపీ విధానాన్ని ప్రకటించాలన్నారు. 16మంది ముఖ్యమంత్రులు పాలించిన సెక్రటేరియట్‌లో ఆ ముఖ్యమంత్రుల కొడుకులు సీఎం లు కాలేదని కేసీఆర్‌ ‌కు పండితులు చెప్పారట. ఆ మూఢ నమ్మకాలతోనే కేసీఆర్‌ ‌సచివాలయాన్ని కూల్చి వేస్తున్నాడు. నమ్మకాలుంటే ఉండొచ్చు…అదే పిచ్చిగా మారొద్దు. నమ్మకాలు ఉంటే ఇంటి వరకే పరిమితం చేసుకోవాలని రేవంత్‌ అన్నారు.

మందిర్‌,‌మస్జీద్‌ల కూల్చివేత బ్లాక్‌డే: మాజీమంత్రి షబ్బీర్‌ అలీ
సెక్రటేరియట్‌ ‌లోని మజీద్‌, ‌మందిరాన్ని కూల్చడాన్ని బ్లాక్‌ ‌డే గా భావిస్తున్నామని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. ప్రణాళికలో భాగంగామే మజీద్‌ను కూల్చటాన్ని అసదుద్దీన్‌ ‌స్వాగతించారని ఆరోపించారు. సొంత దుకాణాలను నడుపుకోవటానికి మతం పేరుతో వేల మంది ప్రాణాలను బలితీసుకున్న చరిత్ర ఎంఐఎం, బీజేపీలదన్నారు. వైఎస్‌ఆర్‌తో మాట్లాడి సచివాలయంలో మజీద్‌ను తానే నిర్మించినట్లు తెలిపారు. అయినా అసలు సెక్రటేరియట్‌కే రాని సీఎం కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. తన వారసుడు కేటీఆర్‌ను సీఎంను చేయడం కోసమే మూఢ నమ్మకంతో..కేసీఆర్‌ ‌కొత్త సెక్రటేరియట్‌ ‌ను నిర్మిస్తున్నారరని షబ్బీర్‌ అలీ ఆరోపించారు. మజీద్‌, ‌మందిర్లను కూల్చుతున్న సీఎస్‌, ‌డీజీపీపై క్రిమినల్‌ ‌కేసులు పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు.

కూల్చినచోటే గుడిని కట్టాలి: రాజాసింగ్‌
‌సెక్రటేరియట్‌లో ఉన్న అమ్మవారి గుడిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎం‌దుకు కూల్చివేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌ప్రశ్నించారు.ఆ గుడిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కట్టలేదు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కట్టలేదు, ఈ ప్రభుత్వం కట్టలేదు.. నిజాం కాలం నాటి గుడి అని లోకల్‌ ‌వాళ్ళు చెబుతున్నారు. గుడి కు ఎందుకు అడ్డం వచ్చింది? ఎందుకు డ్యామేజ్‌ ‌చేశారు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కేసీఆర్‌ .. ‌కు దేవుడి ద నమ్మకం ఉందో నాకు తెలియదు. అప్పుడప్పుడు మొక్కులు తీర్చడం, యాగాలు చేయడం చేస్తుంటారు. అది కూడా ప్రజల కోసం కాదు.. కోసమని అందరికి తెలుసు. గుళ్ళు పడగొట్టొద్దనీ, గుళ్ళు కూల్చి వేస్తే మనం సర్వ నాశనం అవుతామని పెద్దలు, మన పూర్వీకులు చెప్పేవారు. అలాంటిది తెలిసీ ఎందుకు కూల్చారని మండిపడ్డారు. కూల్చిన చోటనే మళ్లీ గుడి కట్టించండి.. లేదంటే నిజాం కు పట్టిన పరిస్థితే కూ రావొచ్చు. ఆలోచన చేసుకోండి అని అన్నారు.

Leave a Reply